Home

»

Latest News

మన్మథుడితో మరో హాట్ పోరి

Apr 29, 2019 10:52AM

 

నవ మన్మథుడు నాగార్జున పక్కన హాట్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ రచన, విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన 'మన్మథుడు'లో ఇద్దరు హీరోయిన్లు సోనాలి బింద్రే, అన్షు నటించారు. మరి, కొత్త కథతో ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న 'మన్మథుడు 2'లో? రకుల్ తో పాటు మరో హాట్ పోరి ఈ సినిమాలో నటిస్తున్నది. కొన్ని కన్నడ, తమిళ సినిమాల్లో నటించిన అక్షర గౌడకు 'మన్మథుడు 2'లో అవకాశం వచ్చింది. ఎన్నారై అమ్మాయి పాత్రలో ఆమె కనిపించనున్నది. తనది చాలా బోల్డ్ , గ్లామరస్ క్యారెక్టర్ అని, మే మొదటివారంలో పోర్చుగల్ లో షూటింగులో జాయిన్ అవుతానని అక్షర గౌడ తెలిపారు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ పోర్చుగల్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు విడుదలైన సినిమా స్టిల్స్ లో రకుల్ హాట్ హాట్ గా కనిపించారు. తనది బోల్డ్, గ్లామరస్ క్యారెక్టర్ అని చెబుతున్న అక్షర ఇంకెంత హాట్ గా కనిపిస్తారో?

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com