నేచురల్ స్టార్ నాని, దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్లడీ రోమియో’. నాని పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. అప్పుడే విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. తాజాగా ఈ సినిమా గురించి నాని కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
‘బ్లడీ రోమియో’ చాలా యూనిక్‌గా, స్టైలిష్‌గా ఉంటుందని నాని చెప్పాడు. ఇందులో వైలెన్స్ ఉన్నప్పటికీ మరీ ఎక్కువగా, రా అండ్ రస్టిక్‌గా ఉండదని తెలిపాడు. సుజీత్ వైలెన్స్‌ను కూడా చమత్కారంగా చూపించేలా ఓ కొత్త ట్విస్ట్ తీసుకొచ్చాడని, యాక్షన్‌తో పాటు మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా సినిమా ఉంటుందని నాని చెప్పాడు. తన పాత్ర కూడా చాలా చమత్కారంగా ఉంటుందని, ఈ జానర్‌లో ఇలాంటి సినిమా ఇప్పటివరకు చూడలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇక ‘బ్లడీ రోమియో’ నాని గత చిత్రం ‘ది ప్యారడైజ్’కు పూర్తిగా భిన్నంగా ఉంటుందని ఆయన తెలిపాడు. టైటిల్ గ్లింప్స్‌లో నానిని ఓ వైపు చెఫ్‌గా, మరోవైపు గ్యాంగ్‌స్టర్‌గా చూపించారు. దీంతో సినిమాలో యాక్షన్‌తో పాటు డార్క్ కామెడీ కూడా ఉంటుందనే విషయం అర్థమవుతోంది. సుజీత్ గతంలో ‘రన్ రాజా రన్’, ‘సాహో’, ‘OG’ వంటి స్టైలిష్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
‘బ్లడీ రోమియో’ను నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్, యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. నానికి జోడీగా ప్రీతి ముకుందన్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా తారాగణం, షూటింగ్ తదితర పూర్తి వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.
[Nani, Bloody Romeo, Nani Bloody Romeo, Nani Sujeeth Movie, Sujeeth, Bloody Romeo Movie, Nani Upcoming Movie, Nani New Movie, Bloody Romeo Update, Nani Bloody Romeo Update, Sujeeth Bloody Romeo, Preity Mukundhan, Nani Action Movie, Telugu Cinema, Tollywood, Bloody Romeo First Look, Nani Sujeeth Combination, Bloody Romeo Release Date]






