
ఒక్క ఛాన్స్.. ఒక్క ఛాన్స్.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా నన్ను నేను నిరూపించుకుంటానని ఖడ్గం మూవీలో రవితేజ ఎంత తాపత్రయ పడతాడో తెలిసిందే. ఒరిజినల్ గా సినీ ఇండస్ట్రీలో దర్శకులుగా రాణించాలని అనుకునే వాళ్ళతో కూడా ఒకే ఒక్క ఛాన్స్ అనే డైలాగ్ 1000 వాల్ట్స్ సౌండ్ తో మారుమోగిపోతుంటుంది.
ఆ కోవలోనే తెలుగు సినీ పరిశ్రమలో ప్రతి ఏటా వందలాది మంది కొత్త దర్శకులు, నటులు, సాంకేతిక నిపుణులు పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. "కొత్త నీరు వచ్చింది", "యూత్ మేకర్స్ ఇండస్ట్రీ రూపురేఖలు మార్చేస్తున్నారు" అంటూ సినీ వర్గాల్లో తీవ్రమైన చర్చలు, ప్రచారాలు జరుగుతుంటాయి. కానీ అసలు ప్రశ్న ఏంటంటే కేవలం ఇండస్ట్రీలో ఒక అవకాశం దొరికితేనే ప్రతిభ నిరూపితమైపోయినట్లేనా!సినీ విశ్లేషకులు, పరిశ్రమ గణాంకాలను పరిశీలిస్తే, కేవలం ఒక అవకాశం చేజిక్కించుకోవడం విజయం కాదని, ఆ అవకాశాన్ని నిలబెట్టుకోవడం మాత్రమే అసలైన ప్రతిభ అని స్పష్టమవుతోంది.
గడిచిన కొన్నేళ్ల టాలీవుడ్ రికార్డులను గమనిస్తే, ప్రయోగాల పేరుతో లేదా యూత్ టార్గెట్ గా సినిమాలు తీసే కొత్త తరం మేకర్లు ఎంతో మంది వస్తున్నారు. అయితే వీరిలో ఎంతమంది ఇండస్ట్రీ ఫేట్ ను లేదా మార్కెట్ స్థిరత్వాన్ని మార్చలేకపోయారనేది ఒక పెద్ద ప్రశ్న మార్క్ గా మిగిలిపోతోంది. టాలీవుడ్ లో ప్రతీ ఏటా దాదాపు 200 కి పైగా సినిమాలు విడుదలవుతుంటే, అందులో 80 శాతానికి పైగా చిత్రాలు కొత్తవారు లేదా చిన్న నిర్మాతలు తీసినవే ఉంటున్నాయి. కానీ, ఆ చిత్రాలలో కనీసం 5 శాతం నుండి 10 శాతం మాత్రమే బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధిస్తున్నాయి. అంటే అవకాశం రావడమనేది ఒక ఆరంభం మాత్రమే, అది పూర్తి విజయానికి హామీ ఇవ్వదు. సినీ పరిశ్రమలో టాలెంట్ నిరూపించుకోవడానికి 100% కష్టం, నిరంతర శ్రమ, మార్కెట్ అవగాహన చాలా అవసరం. కేవలం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు లేదా సోషల్ మీడియా హంగామా ద్వారా లభించే తాత్కాలిక క్రేజ్ తో దీర్ఘకాలం నిలబడటం సాధ్యం కాదు. ఇండస్ట్రీలో సక్సెస్ రేటు 10 శాతం కంటే తక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో, కొత్తవారు మొదటి సినిమాకే తమను తాము మేధావులుగా భావించడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అవకాశం లభించడం వెనుక అదృష్టం, బ్యాకింగ్ లేదా పరిచయాలు ఉండవచ్చు, కానీ 2వ లేదా 3వ అవకాశం రావాలంటే మాత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు మరియు ప్రేక్షకుల ఆదరణ మాత్రమే ప్రామాణికంగా మారుతాయి.అందుకే "అవకాశం రావడం వేరు... ప్రతిభతో పరిశ్రమను ఏలడం వేరు" అని ప్రముఖ సినీ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: జై హనుమాన్ తో మమితా బైజు మైథాలజీ ఎంట్రీ?

కొత్త నీరు పరిశ్రమలోకి రావడం ఎప్పుడూ శుభపరిణామమే అయినా, అనుభవం మరియు కంటెంట్ లో నాణ్యత లేకపోతే ఆ అవకాశాలు ఆవిరైపోతాయి. పరిశ్రమకు కావాల్సింది కేవలం గ్లామర్ లేదా ప్రచార ఆర్భాటాలు కావు; కంటెంట్ లో దమ్ము, ప్రేక్షకుల భావోద్వేగాలను పట్టుకోగలిగే అసలైన ప్రతిభ. కాబట్టి సినీ ప్రయాణంలో తొలి అవకాశం అనేది కేవలం ఒక తలుపు తెరచుకోవడం మాత్రమే, ఆ తలుపు దాటి మైలురాళ్లను చేరుకోవడమే అసలైన విజయం.
[Tollywood Talent vs Opportunity Reality Check, tollywood talent vs opportunity, telugu movie news, tollywood box office success rate, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]





