Home

»

Latest News

మరోసారి వాయిదా పడ్డ నాని ‘ది పారడైజ్’.. ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే?

Jun 8, 2026 4:27PM

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘ది పారడైజ్’. గతంలో వీరి కలయికలో వచ్చిన ‘దసరా’ సంచలన విజయం సాధించడంతో ఈ కొత్త ప్రాజెక్టుపై ట్రేడ్ వర్గాల్లో, అభిమానుల్లో కొండంత అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఒక బ్యాడ్ న్యూస్ వినబడుతోంది. ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ విడుదల మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రాన్ని మొదట మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. ఆగస్ట్ 21న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించాారు. కానీ, అదే డేట్‌కి మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’ మూవీ రాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఒకే రోజు ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు వస్తే థియేటర్ల కొరతతో పాటు కలెక్షన్లపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉండటంతో, నాని సినిమాను ఆగస్టు రేసు నుండి తప్పించి ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట.

మరోవైపు ఈ సినిమా షూటింగ్ ఆశించిన స్థాయిలో వేగంగా సాగకపోవడం కూడా వాయిదాకు మరో ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇప్పటివరకు దాదాపు వంద రోజులకు పైగా చిత్రీకరణ జరిపినప్పటికీ, ఇంకా ఒక కీలకమైన మేజర్ షెడ్యూల్ బాకీ ఉందట. ఈ చిత్రంలో భారీ విజువల్స్, యాక్షన్ సీక్వెన్సులు ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సైతం చాలా సమయం పట్టేలా ఉంది. అందుకే ఆగస్టు నాటికి ఫైనల్ అవుట్‌పుట్ సిద్ధం కావడం కష్టమని భావించి మేకర్స్ వెనక్కి తగ్గినట్లు సమాచారం.

నాని కెరీర్‌లోనే సుమారు రూ. 160 కోట్లకు పైగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయన మునుపెన్నడూ లేని సరికొత్త మాస్ లుక్‌లో కనిపించబోతున్నారు. సికింద్రాబాద్ బస్తీల బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథలో నాని రెండు జడల హెయిర్‌స్టైల్‌తో ఒక పవర్‌ఫుల్ లీడర్‌గా రగ్గడ్ అవతారంలో మెరవనున్నారు. కయాదు లోహర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ‘శికంజా మాలిక్’ అనే పవర్‌ఫుల్ విలన్ రోల్ చేస్తుండటం విశేషం.

ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ‘ఆయా షేర్’ అనే ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయాల్, సంపూర్ణేష్ బాబు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెలుగుతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లోనూ విడుదల కానుంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వాయిదా వార్తలపై నాని అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నప్పటికీ, క్వాలిటీ కోసం సమయం తీసుకోవడం మంచిదేనని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఈ రిలీజ్ పోస్ట్‌పోన్‌మెంట్ గురించిన అధికారిక ప్రకటన చిత్ర యూనిట్ నుండి ఎప్పుడు వస్తుందో చూడాలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com