Home

»

Latest News

బాలయ్య విధ్వంసం.. 'NBK 111' టీజర్‌పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంచలన లీక్!

Jun 8, 2026 4:35PM

నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'NBK 111'. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'వీరసింహారెడ్డి' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ సక్సెస్‌ఫుల్ కాంబో రిపీట్ అవుతుండటంతో టాలీవుడ్ వర్గాలతో పాటు నందమూరి అభిమానుల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 

బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న 'NBK 111' ఫస్ట్ టీజర్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో 'NBK 111' టీజర్ మ్యూజిక్ వర్క్ ఈరోజు పూర్తవుతుందని సంగీత దర్శకుడు తమన్ (Thaman) చెప్పారు. అంతేకాదు ఈ టీజర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందని అన్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి తమన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

ఇటీవల సోషల్ మీడియా వేదికగా సైతం తమన్ స్పందిస్తూ 'NBK111 బ్లాస్ట్.. గోపీచంద్ మలినేని వర్క్ పీక్స్" అన్నట్టుగా ట్వీట్ చేశారు. దానికి దర్శకుడు గోపీచంద్ మలినేని బదులిస్తూ, తమన్ సృష్టించబోయే సంగీత విధ్వంసం కోసం తాను కూడా వెయిట్ చేస్తున్నానంటూ ట్వీట్ చేశారు.

దీనిపై ప్రెస్ మీట్ లో తమన్ రియాక్ట్ అవుతూ, తాను జీవితంలో ఎప్పుడూ ఫేక్‌గా ఉండలేదని, సినిమా అవుట్‌పుట్ అదిరిపోతేనే అంత కాన్ఫిడెంట్‌గా చెప్తానని అన్నారు. "మామూలుగా లేదు టీజర్. వేరే లెవెల్‌లో తీశారు. బాలయ్య గారిని మీరందరూ వేరే లెవెల్ లో చూస్తారు." అని తమన్ హామీ ఇచ్చారు.  

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com