
సినిమా ఫలితంతో సంబంధం లేకుండా న్యాచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ లో అద్భుతమైన పెర్ఫార్మ్ కనపరిచిన విషయం తెలిసిందే. అదే టైంలో తనతో ఊర మాస్ సినిమాలు కూడా తెరకెక్కించవచ్చని మేకర్స్ కి హింట్ కూడా ఇచ్చినట్లయింది. అయితే ప్యారడైజ్' బాక్సాఫీస్ వద్ద అండర్‌పెర్ఫార్మ్ చేయడంతో ఆ ఎఫెక్ట్ నేరుగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తర్వాతి ప్రాజెక్టులపై పడిందనే వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో శ్రీకాంత్ ఓదెల చేయాల్సిన భారీ చిత్రం ఆగిపోయిందంటూ పుకార్లు షికారు చేశాయి.
ఈ క్రమంలో 'ది ప్యారడైజ్' విడుదలైన తర్వాత తొలిసారి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని మాట్లాడుతు 'శ్రీకాంత్ ఓదెల ప్రతిభపై నాకున్న నమ్మకం కొంచెమైనా తగ్గలేదు. ప్యారడైజ్ అండర్‌పెర్ఫార్మ్ చేయడానికి కొన్ని లాజిస్టిక్ సమస్యలు కూడా కారణం. ఇంకా మెరుగ్గా తీర్చిదిద్ది ఉండాల్సింది. శ్రీకాంత్ వద్ద చాలా స్ట్రాంగ్ ఐడియాస్ ఉన్నాయని, ఆ ప్రతిభే అతడిని కచ్చితంగా మునుపటి కంటే బలమైన రీతిలో బాక్సాఫీస్ వద్ద నిలబెడుతుందని నాని కొనియాడారు.
అసలు విషయానికొస్తే, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఒక సినిమా చేయనున్నట్లు గతంలోనే అధికారికంగా ప్రకటించారు, అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్‌కు నానినే స్వయంగా నిర్మాతగా వ్యవహరించాల్సి ఉంది. అయితే 'ది ప్యారడైజ్' సినిమా మేకింగ్ చాలా ఆలస్యం కావడం, మార్చి నుండి ఆగస్టు వరకు దాదాపు 2 సార్లు వాయిదా పడుతూ రావడం వల్ల చిరంజీవి గారు తన ఇతర ప్రాజెక్టులు, ముందస్తు కమిట్‌మెంట్స్‌తో ముందుకు వెళ్లాల్సి వచ్చిందని నాని వివరించారు.
ఇది కూడా చదవండి: 1000 కోట్లు కొట్టబోతున్నాడా: లేక సర్ప్రైజ్‌లు ఏమైనా ఉన్నాయా?
'ది ప్యారడైజ్' రిలీజ్ అయిన తర్వాత తాను ఇప్పటివరకు చిరంజీవి గారిని పర్సనల్‌గా కలవలేదని, త్వరలోనే ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడిన తర్వాత ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తుపై మరింత స్పష్టమైన క్లారిటీ వస్తుందని నాని తెలిపారు. ఈ సినిమా నిర్మాణ అనుభవాల నుంచి తాము ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నామని నాని పేర్కొన్నారు. ఒక ప్రాజెక్ట్ నిర్మాణానికి 3 ఏళ్లు పట్టినా లేదా 5 ఏళ్లు పట్టినా, ఆ సమయాన్ని ప్రణాళికాబద్ధంగా ప్రీ-ప్రొడక్షన్ లేదా పోస్ట్-ప్రొడక్షన్ కోసం ఉపయోగించుకోవాలి తప్ప షూటింగ్ దశలో వృథా చేయకూడదనే విలువైన అనుభవాన్ని పొందామన్నారు.

ఇక తన రాబోయే చిత్రాల విషయానికొస్తే, దర్శకుడు సుజీత్‌తో కలసి చేస్తున్న 'బ్లడీ రోమియో' తెలుగు చిత్రసీమలో ఇప్పటివరకు రాని ఒక సరికొత్త ఫీల్, ఫ్రెష్ కాన్సెప్ట్‌తో రాబోతోందని నాని ధీమా వ్యక్తం చేశారు.
[Nani Reacts Chiranjeevi And Srikanth Odela Movie Update, Natural Star Nani, Srikanth Odela, Chiranjeevi Odela Movie, The Paradise Movie, Bloody Romeo, Telugu Cinema News, Telugu Cinema, Tollywood, Tollywood News]





