Home

»

Latest News

తల్లీ కూతుళ్ల జర్నీలో షాకింగ్ ఇన్సిడెంట్.. ఓటీటీలోకి వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్.!

Oct 7, 2026 2:27PM

మలయాళ సినిమా అంటేనే వైవిధ్యమైన కథలు, సహజమైన పాత్రలు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్‌లో అక్కడి దర్శకులు ఎప్పటికప్పుడు కొత్త తరహా కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంటారు. అలాంటి మరో సినిమానే ‘ఆశ’. సీనియర్ నటి ఊర్వశి, జోజు జార్జ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది.

‘ఆశ’ సినిమాకు నవతరం దర్శకుడు సఫర్ సనల్ దర్శకత్వం వహించాడు. కథను కూడా ఆయనే అందించగా.. జోజు జార్జ్, రమేష్ గిరిజ, సఫర్ సనల్ కలిసి స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రూపొందించారు. వినాయక అజిత్ నిర్మించిన ఈ సినిమాలో ఊర్వశి, జోజు జార్జ్‌తో పాటు ఐశ్వర్య లక్ష్మి, విజయరాఘవన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఒక సాధారణ కుటుంబ కథలా మొదలై.. ఆ తర్వాత ఊహించని పరిణామాల వైపు కథ మలుపు తిరుగుతుందని ట్రైలర్‌తోనే ఆసక్తి పెరిగింది.

కథలోకి వెళితే.. ఆశ నడివయసు దాటిన మహిళ. జీవితంలో ఎదురైన చేదు అనుభవాల కారణంగా ఆమెలో మొండితనం, కోపం ఎక్కువగా ఉంటాయి. భర్తను కోల్పోయిన ఆమె తన ఇద్దరు కుమార్తెలను పెంచుకుంటూ ఉంటుంది. ఒకరోజు రాత్రి తన చిన్న కుమార్తె అనఘతో కలిసి కారులో ప్రయాణిస్తున్న సమయంలో అనుకోకుండా ఓ చిన్న రోడ్డు ప్రమాదం జరుగుతుంది. అక్కడ జీమన్ అనే వ్యక్తితో ఏర్పడిన గొడవతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. సాధారణంగా పరిష్కరించుకోవాల్సిన చిన్న గొడవ కాస్తా.. వరుసగా ఊహించని సంఘటనలకు దారితీస్తుంది. ఆ తర్వాత ఆశ కుటుంబంలో ఎలాంటి సమస్యలు మొదలయ్యాయి? జీమన్‌తో ఆమెకు జరిగిన గొడవ ఎక్కడికి దారితీసింది? అసలు ఈ వ్యవహారం వెనుక ఉన్న కారణం ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఈ సినిమాలో ఊర్వశి నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంతకుముందు చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా, కోపం, బాధ, మొండితనం, మానసిక సంఘర్షణతో కూడిన మహిళగా ఆమె కనిపించారు. మరోవైపు జోజు జార్జ్ కూడా జీమన్ పాత్రలో తనదైన శైలిలో ఆకట్టుకున్నారని సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి స్పందన వచ్చింది. ఇద్దరి మధ్య జరిగే ఈగో వార్, ఆ తర్వాత చోటుచేసుకునే పరిణామాలు కథలో కీలకంగా నిలుస్తాయి. మధు నీలకంఠన్ ఛాయాగ్రహణం, షాన్ మహ్మద్ ఎడిటింగ్, గోవింద్ వసంత బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు సస్పెన్స్ వాతావరణాన్ని తీసుకొచ్చాయి.

ఇదిలా ఉంటే.. థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోనే ‘ఆశ’ ఓటీటీలోకి వస్తోంది. అక్టోబర్ 16 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ ఈ సినిమాను చూసే అవకాశం ఉండనుంది. థియేటర్లలో ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌ను మిస్ అయిన వాళ్లు ఇప్పుడు ఇంట్లోనే చూసేయొచ్చు.

 

 

[Aasha Movie, Aasha OTT Release, Aasha OTT, Aasha ZEE5, Urvashi Aasha Movie, Joju George Aasha, Aasha Malayalam Movie, Aasha Telugu OTT, Malayalam Psychological Thriller, Malayalam Thriller Movies, ZEE5 Malayalam Movies, Aasha Movie Telugu] 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com