
సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ మీద మతిమారన్ పుగళేంది తెరకెక్కించిన చిత్రం ‘మండాడి’. ఈ సినిమాని ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. ఈ మూవీలో సూరి, సుహాస్ తో పాటు మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఏపీ, తెలంగాణలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సెప్టెంబర్ 10న రిలీజ్ చేసింది.
తమిళ, తెలుగు భాషల్లోనే కాకుండా రిలీజ్ చేసిన అన్ని చోట్లా ‘మండాడి’కి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకి తమిళనాడులో వంద కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా లెక్కల్ని చూసుకుంటే రూ. 150 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. సూరి, సుహాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా ‘మండాడి’ నిలిచింది.
‘మండాడి’ సినిమాలోని బోట్ సీక్వెన్స్, రేసింగ్ సీన్స్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ‘మండాడి’ సినిమాకి కథిర్ అందించిన విజువల్స్, జీవీ ప్రకాష్ బీజీఎం, పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి హైలెట్‌గా నిలిచాయి. సూరి, సుహాస్ నటన, వారి పాత్రలు సినిమాని నిలబెట్టాయి.
ఇది కూడా చదవండి: 15 నిమిషాలు శ్వాస ఆపి.. షాకిచ్చిన ప్రముఖ నటుడు.!

[Mandaadi 150 Crore Gross, Mandaadi Collections, Mandaadi Box Office, Mandaadi Worldwide Gross, Soori Mandaadi Movie, Suhas Mandaadi Movie, Telugu Film News]





