Home

»

Latest News

ఎందుకు మీకు అంత అసూయ: బరాబర్ ఇంకా ఎదుగుతాం!

Sep 29, 2026 10:21AM


అల్లు అంటే ఇంటిపేరు కాదు ఇట్స్ ఏ బ్రాండ్ అని చాటి చెప్పి ఐకాన్ స్టార్ గా ఎదిగాడు అల్లు అర్జున్. అభిమానులు, పాన్ ఇండియా ప్రేక్షకుల్లో అయితే నిత్యం 'అల్లు' నామస్మరణ వినిపిస్తూనే ఉంటుంది. తెలుగు హీరోకి మొట్టమొదటి జాతీయ అవార్డు కూడా తెచ్చిపెట్టి చరిత్ర సృష్టించాడు. ఇక అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ అయితే నిర్మాతగా మూడున్నర దశాబ్దాలపై నుంచే తెలుగు సినిమా నిద్రలో కూడా లేచి ఇవిరా అల్లు అరవింద్ సినిమాలు అని చెప్తుంది.లెజండ్రీ కమెడియన్, క్యారక్టర్ ఆర్టిస్ట్ అల్లు అర్జున్ తాతయ్య అల్లు రామలింగయ్య గురించి అయితే నిద్ర పోకుండా కూడా చెప్తుంది. అంతలా అల్లు బ్రాండ్ విశ్వజనితం. అదంతా ఒక్క రోజులో వచ్చింది కాదు, ఎన్నో సంవత్సరాల కష్టంతోనే వచ్చిన విషయం ప్రతి సినీ ప్రేక్షకుడికి తెలుసు. 


ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ రీసెంట్ గా షేక్ పేటలోని ఆంజనేయస్వామి గుడికి చెందిన నిర్వాహకులు    అర్ధరాత్రి 2 గంటల వరకూ భక్తి పేరుతో  మైక్ లు పెడుతూ సౌండ్ పొల్యూషన్ చేస్తున్నారని పరిస్థితులపై స్పందిస్తూ ‘‘మాకు ఇబ్బందిగా ఉంది’’ అన్నట్టుగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ వ్యాఖ్యలపై చర్చ జరగాల్సిన స్థానం కాస్తా.. అల్లు అర్జున్‌ను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్‌కు దారితీసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక కుటుంబ సభ్యుడు తన వ్యక్తిగత అనుభవాన్ని చెప్పినంత మాత్రాన.. అందులోకి అల్లు అర్జున్ కెరీర్, వ్యక్తిగత జీవితం, కుటుంబాన్ని లాగడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

 

అల్లు అర్జున్ కుటుంబంపై నిజంగా 'అసూయ' ఉందా? లేక ఫ్యాన్ వార్స్, సోషల్ మీడియా ట్రోలింగ్ సంస్కృతి ప్రభావమా? అనే ప్రశ్నకు సమాధానం ఒక్కటే కాకపోవచ్చు. కానీ తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి వెళ్లాలని కోరుకునే సమయంలో.. మన హీరోల విజయాలను వ్యక్తిగత పోటీగా కాకుండా తెలుగు సినిమా విజయంగా చూడాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం మాత్రం బలపడుతోంది.అసలు అల్లు శిరీష్ ప్లేస్ లో అల్లు అర్జున్ పేరు ప్రస్తావనికి రావడం ఏంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇంకొంత అంది అభిమానులైతే అల్లు ఫ్యామిలీపై అంత అసూయ ఎందుకు, పుట్టింది పోడానికే అని తెలియదా అనే కామెంట్స్ చేస్తున్నారు.

 

[Allu Arjun, Allu Aravind,Allu Sirish, Allu Arjun Family Trolling Allu Sirish Comments,  Tollywood Controversies, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com