ఆ సినిమాపై నానికి అంత నమ్మకం ఏమిటో?
on Oct 23, 2020

'శ్యామ్ సింగ రాయ్' సినిమా కథపై నాచురల్ స్టార్ నానికి ఎంత బలమైన నమ్మకం లేకపోతే ఓ నిర్మాత చేయలేనని చెప్పినా... మరో నిర్మాతను వెతుకుతారు చెప్పండి? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సినిమాను చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నారట. అసలు వివరాల్లోకి వెళితే...
నాని హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ 'జెర్సీ' నిర్మించింది. లాభాలు ఎంతోవచ్చాయనేది పక్కన పెడితే... ఆ సినిమాకు మంచి పేరు వచ్చింది. 'జెర్సీ' విడుదల తర్వాత నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో 'శ్యామ్ సింగ రాయ్' సినిమా ప్రకటించింది సితార ఎంటర్టైన్మెంట్స్. కరోనా తదనంతర పరిస్థితుల నేపథ్యంలో భారీ బడ్జెట్ పెట్టి ఆ సినిమా చేయలేనని తప్పుకుంది. అయితే... చిత్ర కథపై విపరీతమైన నమ్మకం ఉందని మరో నిర్మాత వెతికారని తెలిసింది.
'టక్ జగదీష్' చిత్రీకరణ పూర్తయిన తర్వాత కలకత్తా నేపథ్యంలో సాగనున్న 'శ్యామ్ సింగ రాయ్' సినిమా చిత్రీకరణ మొదలు పెట్టాలని నాని నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇందులో ఓ కథానాయికగా సాయి పల్లవి, మరో కథానాయికగా నిత్యమీనన్ ఖరారు అయినట్లు సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



