Home

»

Latest News

నాని విల‌న్‌.. ఆది పినిశెట్టి

Nov 23, 2016 2:21PM

గుండెల్లో గోదారి లాంటి సినిమాల‌తో ఆక‌ట్టుకొన్నాడు ఆది పినిశెట్టి. అయితే...  స‌రైనోడుతో ఆదికి క్రేజ్ వ‌చ్చింది. అల్లు అర్జున్‌కి ధీటైన విల‌న్ పాత్ర‌లో ఆది న‌ట‌న విమ‌ర్శ‌కుల ప్ర‌సంశ‌లు అందుకొంది. స‌రైనోడు క‌థ రొటీనే అయినా.. ఆది విల‌నిజం ఆ సినిమాకి కొత్త ద‌నం అద్దింది. ఇప్పుడు మ‌రోసారి అలాంటి పాత్ర‌లోనే క‌నిపించ‌బోతున్నాడు ఆది.  నాని క‌థానాయ‌కుడిగా ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. నివేథా థామ‌స్ క‌థానాయిక‌. ఈ రోజే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించుకొంది. ఈ సినిమాలో విల‌న్ గా ఆది పినిశెట్టి క‌నిపించ‌బోతున్నాడు. నానితో పాటు ఆదిదీ ప‌వ‌ర్ ఫుల్ రోల్ అని తెలుస్తోంది. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న నాని.. స్క్రిప్టు విష‌యంలో ఎంత ప‌క్కాగా ఉంటాడో తెలిసిందే. కేవ‌లం నానిపై న‌మ్మ‌కంతోనే ఆది ఈ సినిమా ఒప్పుకొన్నాడ‌ట‌. స‌రైనోడుతో స‌రైన దారిలో ప్ర‌యాణం ప్రారంభించిన ఆది... ఈ సినిమాతో మ‌రో మెట్టు ఎక్కుతాడేమో చూడాలి. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com