Home

»

Latest News

ఎన్టీఆర్‌కి ఏమైంది? చివ‌రకు ఫ్లాప్ డైరెక్ట‌ర్‌తోనా??

Nov 23, 2016 2:42PM

జ‌న‌తా గ్యారేజ్ త‌ర‌వాత ఓ ప‌ది క‌థ‌ల వ‌ర‌కూ విన్నాడు ఎన్టీఆర్‌. చిత్ర‌సీమ‌లో అగ్ర ద‌ర్శ‌కులు, కొత్త వాళ్లు, హిట్ల‌తో దూకుడుమీదున్న‌వాళ్లు ఎన్టీఆర్‌కి క‌థ‌లు చెప్పారు. అయితే అవేం ఎన్టీఆర్‌ని ఆక‌ర్షించ‌లేదు. చివ‌రికి ఓ ఫ్లాప్ డైరెక్ట‌ర్ చెప్పిన క‌థ‌కు ఓకే చెప్పేశాడ‌ని ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రో కాదు.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి `స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌` లాంటి డిజాస్ట‌ర్ ఇచ్చిన బాబి. ప‌వ‌ర్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు బాబి. ఆ సినిమా హిట్ట‌య్యింది. వెంట‌నే ప‌వ‌న్ నుంచి ఆఫ‌ర్ వ‌చ్చింది.

అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ స్టామినాని స‌రైన స్థాయిలో ప్ర‌జెంట్ చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. ఆ త‌ర‌వాత ర‌వితేజ నుంచి పిలుపొచ్చింది. ఎందుకో ఆ ప్రాజెక్టు ప‌ట్టాలెక్క‌లేదు. ఇప్పుడు అనూహ్యంగా ఎన్టీఆర్ సినిమాకి ఓకే అయ్యాడ‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల బాబి ఎన్టీఆర్‌లు ఇద్ద‌రూ క‌లుసుకొని, క‌థ గురించి చ‌ర్చించుకొన్నార‌ని, బాబి చెప్పిన క‌థ ఎన్టీఆర్‌కి బాగా న‌చ్చింద‌ని తెలుస్తోంది. ఇంత మంది హిట్ ద‌ర్శ‌కుల్ని వ‌ద్ద‌నుకొని.. బాబిని ప‌ట్టాడేంటోమ‌రి. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఇది ఆందోళ‌న క‌లిగించే విష‌య‌మే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com