Home

»

Latest News

బాలమురళీ తన పిల్లలను సంగీతంలోకి ఎందుకు రానివ్వలేదు..

Nov 23, 2016 11:41AM

ప్రఖ్యాత సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఇక లేరన్న వార్త తెలిసిన తర్వాత ఆయన గురించి ఆన్‌లైన్‌లో అలజడి మొదలైంది..ఆయన వీకీపీడియా కోసం, పాటలు, కీర్తనల గురించి జనం తెగ వెతికేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో చర్చలు కూడా ఊపందుకున్నాయి. అయితే యాక్టర్ కొడుకు.. యాక్టర్ అవ్వాలి, డాక్టర్ కొడుకు డాక్టర్ కావాలి కదా..!  మరి మంగళంపల్లిగారి తర్వాత ఆయన వారసులు కూడా సంగీతంలో అంతటి విద్వాంసులు కావాలి...కాని వారి పిల్లలు గురించి ఎక్కడా ప్రస్తావన లేకపోవడం జనాన్ని ఆలోచనలో పడేసింది.

అందుకు కారణం ఉంది. ఒక ఇంటర్వ్యూలో ఆయన్ను ఇదే ప్రశ్న అడిగితే అందుకు ఆయన సంగీతరంగం మీద ఆధారపడి బతకటం చాలా కష్టం. పేరు రావటం సంగతి పక్కనబెడితే డబ్బు రాదు. ఒక్క సంగీత కచేరి మీద కుటుంబాన్ని గడపటం కష్టం. ఇన్ని వేల కచేరీలు చేసిన నాకే పొద్దున్న కచేరీకి ఎవరైనా పిలుస్తారన్న నమ్మకం లేదు. అలాంటి స్థితి నా పిల్లలకు వద్దు..అందుకే మా పిల్లలందర్ని మంచి చదువులు చదివించాను. మంచి పొజిషన్‌లో ఉన్నారు. వాళ్లంతా నాకంటే బాగా సంపాదిస్తున్నారు అని చెప్పుకొచ్చారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com