రిలీజ్ చేసేయండి అంటోన్న రివేంజ్ రైటర్!!
on Jul 24, 2019
నేచరల్ స్టార్ నాని హీరోగా, విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకుడుగా మెగాస్టార్ చిరంజీవి టైటిల్ తో రూపొందుతోన్న చిత్రం `గ్యాంగ్ లీడర్`. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు సాంగ్ కూడా ఒకటి విడుదలై సినిమా పై ఇప్పటికే అంచనాలను రేకేత్తిస్తోంది. ఇదిలా ఉంటే ఈ రోజు `గ్యాంగ్ లీడర్` టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ టీజర్ ఎంతో ఆసక్తికరంగా ఉంటూ సినిమా పై రెట్టింపు క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. ఎనిమిదేళ్ల చిన్న పాప, పదిహేడేళ్ల టీనేజ్ అమ్మాయి, ఇరవై రెండేళ్ల పెళ్లికొచ్చిన అమ్మాయి, యాభై ఏళ్ల మహిళ, అరవై దాటిన బామ్మ...ఇలా ఈ ఐదుగురు ఆడవాళ్లకు ఒక లీడర్ . అతడే హీరో నాని. ఇలాంటి డిఫరెంట్ కధాంశంతో ఓ టిపికల్ కథనంతో మరోసారి దర్శకుడు విక్రమ్ మాయచేబోతున్నట్లుగా టీజర్ చూస్తే అర్థమవుతోంది. నానిని పెన్సిల్ గా పరిచయం చేసిన విధానం బావుంది. ఈ పెన్సిల్ పార్థసారథి రివేంజ్ రైటర్ గా అలరించబోతున్నాడు. ఒక సీరియస్ కాన్సెప్ట్ ని తీసుకుని దర్శకుడు ఫన్నీ ట్రీట్ మెంట్ తో ఆడియన్స్ కు ట్రీట్ ఇవ్వబోతున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. ఇక ఫైనల్ గా `వీళ్లతో నా వల్ల కాదు నన్ను రిలీజ్ చేసేయండి `అనే డైలాగ్ తో టీజర్ ఎండ్ అవతుఉంది. ఇక ఈ సినిమాను మొదట ఆగస్ట్ 30న అనుకున్నారు కానీ, ఆ రోజు సాహో రిలీజ్ ఉండటం వలన మరో డేట్ ప్రకటించే అవకాశాలున్నాయి.