'అంటే సుందరానికి' కాంబోలో మరో మూవీ!
on Feb 15, 2023

నేచురల్ స్టార్ నాని హీరోగా 'బ్రోచేవారెవరురా' ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన 'అంటే సుందరానికి' సినిమా గతేడాది విడుదలై ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ చిత్రానికి ఓటీటీలో విశేష ఆదరణ లభించింది. వివేక్ ఆత్రేయ సెన్సిబుల్ రైటింగ్, నాని నేచురల్ పర్ఫామెన్స్ మెప్పించాయి. ఇదిలా ఉంటే వీరి కాంబినేషన్ లో మరో సినిమా రానుందని తెలుస్తోంది.
నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో 'దసరా' చిత్రాన్ని పూర్తి చేశాడు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో మార్చి 30న విడుదల కానుంది. అలాగే తన 30వ సినిమాని శౌర్యువ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఇటీవల ఘనంగా ప్రారంభమైంది. అలాగే శైలేష్ కొలను దర్శకత్వంలో నాని 'హిట్-3' చేయాల్సి ఉంది. కానీ శైలేష్ ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో 'సైంధవ్' అనే మూవీ చేస్తున్నాడు. దీంతో 'హిట్-3'కి సమయం పట్టే అవకాశముంది. ఇక ఇప్పుడు నాని మరో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వినికిడి. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సినిమా చేయడానికి నాని ఓకే చెప్పాడని, ఇది డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రూపొందనుందని సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



