Home

»

Latest News

జామ్ పార్టీలో సందడే సందడి: డ్యాన్స్‌తో నాని, నితిన్ రచ్చ.!

Nov 18, 2026 6:39PM

సినిమా ప్రమోషన్స్‌లో కొత్తదనం చూపించాలంటే నాని తర్వాతే ఎవరైనా. తన సినిమాలకే కాదు.. తాను సమర్పిస్తున్న సినిమాల ప్రమోషన్స్‌లోనూ నాని తనదైన స్టైల్‌లో సందడి చేస్తుంటారు. ఇప్పుడు నితిన్ నటిస్తున్న ‘అలియాస్ రుక్మిణి’ కోసం కూడా అదే జోష్ చూపించారు. తాజాగా జరిగిన జామ్ పార్టీలో నాని, నితిన్ కలిసి ‘రుకు రుకు రుక్మిణి’ పాటకు స్టెప్పులేస్తూ సందడి చేశారు.

ఈ పార్టీకి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యంగా నాని, నితిన్ కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ పార్టీ పూర్తి వీడియోను రేపు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

ఈ ప్రమోషనల్ ఈవెంట్‌లో మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. నాని, నితిన్ మధ్య ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. నాని తన కెరీర్ ప్రారంభంలో నితిన్‌ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్ గా పనిచేశారు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"ఒకప్పుడు నేను నితిన్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ ని. నా బిగినింగ్స్ లో ఒక పేజీ నితిన్ ది. ఇప్పుడు నితిన్ రీ బిగినింగ్స్ లో ఒక పేజీ నాది." అంటూ నాని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

ఇది కూడా చదవండి: అప్పుడు మల్లెపూల పల్లకి.. ఇప్పుడు రఘుకుల తిలక.!

నితిన్ నటిస్తున్న ‘అలియాస్ రుక్మిణి’ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మురళీ కాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అఫియా సయ్యద్ హీరోయిన్. ఈ సినిమాను నాని సమర్పించగా, దీప్తి గంటా నిర్మించారు. డిసెంబర్ 4న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

మీకు నచ్చవచ్చు:
నీ గూడు చెదిరింది.. ప్రతి పదంలోనూ ఒక విషాదం.. పాటలోని అసలు భావం ఇదే.!
రెండేళ్లుగా మంచానికే పరిమితమైన స్టార్ యాక్టర్.. కన్నీళ్లు తెప్పిస్తున్న రియల్ స్టోరీ.!

 

 

 

[Nani Nithiin Dance, Alias Rukmini, Jam Party, Ruku Ruku Rukmini Song]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com