Home

»

Latest News

బ‌న్ని చిత్రంలో బాలీవుడ్ యాక్ట‌ర్!!

Apr 1, 2019 4:18PM

 

క‌థానాయుకుడు అల్లు అర్జున్ , మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్ లో కొత్త సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ , గీతా ఆర్ట్స్ ప‌తాకాల‌పై ఎస్. రాధాకృష్ణ , అల్లు అర‌వింద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించ‌నున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

కాగా ఇందులో బాలీవుడ్ స్టార్ నానా ప‌టేక‌ర్ న‌టించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు ఆయ‌న్ను ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు సంప్ర‌దించిన‌ట్లు స‌మాచారం. 2008 లో భార‌తీరాజ‌న్ `బొమ్మ‌లాట్టం` సినిమాతో నానా  ప‌టేక‌ర్ ద‌క్షిణాదాకి
ప‌రిచ‌యం అయ్యారు. ఇటీవ‌ల వ‌చ్చిన ర‌జ‌నీకాంత్ `కాలా` సినిమాలో ప్ర‌తినాయుకుడిగా న‌టించారు.

హాలీవుడ్ సినిమా `ఇన్ వెన్ష‌న్ ఆఫ్ లైమింగ్` సినిమా ఆధారంగా ఈ సినిమాను తీస్తున్న‌ట్టు చెబుతున్నారు. పూజా హెగ్డే ఇందులో క‌థానాయిక పాత్ర పోషించ‌బోతున్నార‌ట‌. దీని త‌ర్వాత బ‌న్నీ ద‌ర్శ‌కుడు సుకుమార్ తీయ‌బోతున్న సినిమాలో న‌టించ‌నున్నార‌ట‌. ఈ సినిమా `నాన్న‌- నేను` అనే టైటిల్ ను ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com