Home

»

Latest News

పూరీ వ‌ల్లే ఆ ప‌ని చేయాల్సివ‌చ్చింది

Oct 15, 2016 3:01PM

 

సిక్స్‌ప్యాక్ ఈరోజుల్లో మ‌హా చీప్ అయిపోయింది. ఇది వ‌ర‌కు సిక్స్ ప్యాక్ చేస్తే... ఆహా, ఓహో అనుకొనేవారు. ఆ త‌ర‌వాత సూప‌ర్ స్టార్ నుంచి సునీల్ వ‌ర‌కూ అంద‌రూ సిక్స్ ప్యాక్‌ల‌తో క‌నిపించీ, క‌నిపించీ మొహం మొత్తేసేలా చేశారు. అందుకే సిక్స్ ప్యాక్ కూడా వెండి తెర‌పై ఓ రొటీన్ ఫార్ములాగా మారిపోయింది. ఇప్పుడు ఇజం కోసం క‌ల్యాణ్ రామ్ సిక్స్ ప్యాక్ చేశాడు. ''సిక్స్ ప్యాక్ పాతది అయిపోయింది.. బ‌హుశా సిక్స్ ప్యాక్ చేసిన చివ‌రి హీరో నేనే అవ్వొచ్చు..'' అంటూ త‌న‌పై తానే జోక్ కూడా వేసేస్తున్నాడు.  పూరి జ‌గ‌న్నాథ్ కోరిక మేర‌కే ఇందులో క‌ల్యాణ్ రామ్ సిక్స్ ప్యాక్ చేశాడ‌ట‌. ఈ సినిమా మొద‌ల‌య్యేట‌ప్ప‌టికి క‌ల్యాణ్ రామ్ బ‌రువు 84 కిలోల వ‌ర‌కూ ఉండేద‌ట‌. బ‌రువు త‌గ్గాల్సిందే అంటూ పూరి తెగేసి చెప్ప‌డంతో.. మూడు నెల‌ల్లో ప‌ది కిలోల బ‌రువు త‌గ్గాడ‌ట క‌ల్యాణ్ రామ్‌. ఈ మూడు నెల‌లూ జిమ్ తో తెగ క‌ష్ట‌ప‌డ్డాన‌ని, త‌న‌కు ఇష్టం లేక‌పోయినా చేప‌లు తినాల్సివ‌చ్చింద‌ని త‌న క‌ష్ట‌మంతా చెప్పుకొచ్చాడు క‌ల్యాణ్ రామ్‌. అయితే.. ఈ లుక్ త‌న‌కెంతో బాగా సూట్ అయ్యింద‌ని, తెర‌పై చాలా స్టైలీష్‌గా క‌నిపించాన‌ని చెబుతున్నాడు. మ‌రి క‌ల్యాణ్‌రామ్ ఇజంలో ఎలా క‌నిపించాడో తెలియాలంటే ఈనెల 21 వ‌ర‌కూ ఆగాలి. ఎందుకంటే ఇజం విడుద‌ల అయ్యేది అప్పుడే క‌దా?

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com