Home

»

Latest News

ఆ ఫ్లాప్ డైరెక్ట‌ర్‌కి బ‌న్నీ లైఫ్ ఇస్తున్నాడా?

Oct 15, 2016 3:03PM

 

ఫ్లాప్ ద‌ర్శ‌కుడు అనే ముద్ర ప‌డిపోయిన త‌ర‌వాత మ‌ళ్లీ మెగా ఫోన్ ప‌ట్టుకోవ‌డం చాలా చాలా క‌ష్టం. ఎందుకంటే యంగ్ డైరెక్ట‌ర్స్ త‌న త‌డాఖా చూపిస్తున్నారు. స్టార్లు ఎలాగూ రాజ్యం ఏలుతున్నారు. రోజుకో కొత్త ద‌ర్శ‌కుడు వ‌చ్చేస్తున్నాడు. ఈ ద‌శ‌లో ఫ్లాపు వీరుల‌కు అవ‌కాశాలు దొరక‌డం బ‌హు క‌ష్టం. ఆ కష్టం ఎలా ఉంటుందో బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌ని అడిగితే తెలుస్తుంది. బొమ్మ‌రిల్లు సినిమాతో ఒక్క‌సారిగా ప‌రిశ్ర‌మ దృష్టిని త‌న వైపుకు తిప్పుకొన్నాడు భాస్క‌ర్‌. ఆ త‌ర‌వాత వ‌చ్చిన ప‌రుగు ఓకే అనిపించింది. అయితే ఆరెంజ్ అట్ట‌ర్ ఫ్లాప్‌, ఒంగోలు గిత్త డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో బొమ్మరిల్లు కెరీర్ కుప్ప‌కూలిపోయింది. ఆ రెండు సినిమాల త‌ర‌వాత భాస్క‌ర్ పేరు ఎక్క‌డా వినిపించ‌లేదు. ఈలోగా త‌మిళంలో ఓ సినిమా చేశాడు. అదీ ఫ్లాప‌య్యింది. ఇక బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌కి మ‌రో అవ‌కాశం రావ‌డం క‌ష్టం అనిపించింది. ఆయ‌న పేరు మ‌ర్చిపోవొచ్చు అనుకొంటున్న త‌రుణంలో ఓ బ‌డా నిర్మాణ సంస్థ‌లో బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌కి ఛాన్స్ వ‌చ్చింది. త్వ‌ర‌లోనే గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో భాస్క‌ర్ ఓ సినిమా చేయొచ్చ‌న్న‌ది ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. అల్లు అర్జున్‌తో  ఉన్న స్నేహం కొద్దీ భాస్క‌ర్‌కు ఈ అవ‌కాశం వ‌చ్చింద‌ట‌. అయితే ఈ సినిమాలో బ‌న్నీ హీరోగా న‌టించ‌డ‌ని, ఆ స్థానంలో మ‌రో హీరో కోసం ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని తెలుస్తోంది. నిజంగా బ‌న్నీ ఇంత పెద్ద హృద‌యం చేసుకోవ‌డం గొప్ప విష‌య‌మే. మ‌రి ఈసారి బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ఏం చేస్తాడో??

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com