బోయపాటికి బాలయ్య షాక్??
on Nov 30, 2016

నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను... వీళ్లిద్దరిదీ తిరుగులేని కాంబినేషన్. బాలయ్యకు అంత్యంత కీలకమైన సమయంలో సింహా, లెజెండ్‌లాంటి రెండు సూపర్ డూపర్ హిట్లు ఇచ్చాడు బోయపాటి. పైగా బాలయ్యని సరికొత్తగా తెరపై చూపించి నందమూరి అభిమానుల మనసుల్ని గెలుచుకొన్నాడు. నందమూరి వారసుడు, బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కూడా బోయపాటి శ్రీను చేతుల మీదుగానే ఉంటుందని బాలయ్య ఫ్యాన్స్ భావించారు. 2017లో మోక్షజ్ఞ తెరపైకి వస్తున్నాడని, దానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తారని చెప్పుకొన్నారు.
అయితే ఇప్పుడు ఆప్లాన్ మారినట్టు సమాచారం. మోక్షజ్ఞని బాలయ్య క్రిష్ చేతిలో పెట్టినట్టు విశ్వసనీయ వర్గాలు చెప్పుకొంటున్నాయి. బాలయ్య వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కోసం క్రిష్‌తో పనిచేశాక.. క్రిష్‌పై బాలయ్యకు బాగా నమ్మకం ఏర్పడిందట. మోక్షజ్ఞని బోయపాటి చేతిలో పెట్టడం కంటే, క్రిష్ లాంటి సెన్సిబుల్ డైరెక్టర్ చేతిలో పెట్టడమే కరెక్ట్ అని బాలయ్య డిసైడ్ అయ్యాడని టాలీవుడ్ టాక్. 2017లోనే మోక్షజ్ఞతో క్రిష్ సినిమా ఉంటుందని సమాచారం. సో.. మోక్షజ్ఞకు దర్శకుడు దొరికేసినట్టే అన్నమాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



