ఈరోజు నుంచే శాతకర్ణి యుద్ధం మొదలు..!
on May 9, 2016

నందమూరి బాలకృష్ణ వందో సినిమాగా గౌతమీపుత్ర శాతకర్ణి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రారంభోత్సవాన్ని చేసేసిన శాతకర్ణి, ఈ రోజు నుంచే సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాడు. మొరాకో లో మొదటి షెడ్యూల్ ను ఈరోజు నుంచే మొదలుపెడుతున్నాడు బాలయ్య. ఇప్పటికే క్రిష్, బాలయ్య అండ్ బ్యాచ్ మొత్తం మొరాకో చేరుకున్నారు. ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ లిద్దరూ ఇక్కడి యుద్ధ సన్నివేశాలకు రంగం సిద్ధం చేస్తున్నారట. ఈ వార్ సీక్వెన్సెస్ లో భారీగా విదేశీ నటుల్ని తీసుకుంటారని సమాచారం. ఒకటో శతాబ్దంలో శాతకర్ణి చేసిన యుద్ధాల్ని తెరకెక్కించే పనిలో మూవీ టీం బిజీ బిజీగా ఉంది. తెలుగు వారి కథ, ఇప్పటి వరకూ ఎవరికీ తెలియని కథ అని మొదటినుంచీ చెబుతున్న శాతకర్ణి చిత్ర యూనిట్, ఆ అంచనాలను అందుకునే ప్రయత్నంలో భారీ బడ్జెట్ తో సినిమాను రూపొందిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్స్ హేమమాలిని, కబీర్ బేడీ లు సినిమాలో కీలక పాత్రలు పోషిస్తుండగా, దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నాడు. క్రిష్ తన సొంత సంస్థ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై సన్నిహితుడు రాజీవ్ రెడ్డి తో కలిసి ఈ సినిమాను నిర్మించడం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



