ఆరు నెలల్లో గౌతమిపుత్ర శాతకర్ణి రిలీజ్..!
on Apr 25, 2016
.jpg)
ఈ రోజుల్లో ఒక సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని థియేటర్లలోకి రావాలంటే మినిమమ్ వన్ ఇయర్ కన్ఫామ్. అదే పెద్ద హీరోల సినిమాలయితే చెప్పనవసరం లేదు. వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది. మరి చారిత్రక నేపథ్యం, విజువల్ ఎఫెక్ట్స్ లాంటి భారీ టచప్ ఉన్న సినిమాలు ప్రేక్షకుల కళ్ల ముందుకు రావాలంటే మూడు సంవత్సరాలు పక్కా గ్యారెంటీ. అందుకు బాహుబలి, మొహంజోదారో తదితర సినిమాలు బెస్ట్ ఎగ్జాంపుల్. కానీ నటసింహ నందమూరి బాలకృష్ణ తన 100వ చిత్రాన్ని మాత్రం ఆరు నెలల్లో రిలీజ్ చేస్తానంటున్నారు.
ఇప్పటికే ఈ సినిమా కోసం అన్ని పనులు చకచకా జరిగిపోతున్నాయి. సినిమా ఎనౌన్స్ చేసిన పదిరోజుల్లోనే లాంచ్ చేసేశారు కూడా. హీరోయిన్ మిగతా సాంకేతిక నిపుణులు ఎంపికపై డైరెక్టర్ క్రిష్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. ఇప్పుడిక షూటింగ్‌కు కూడా బయలుదేరబోతోంది ఆ మూవీ టీమ్. సినిమాకే హైలెట్ అనదగ్గ మేజర్ యాక్షన్ పార్ట్‌ను షూట్ చేయడానికి క్రిష్ సారథ్యంలో ఒక టీమ్ మొరాకో వెళ్లబోతోంది. శాతకర్ణి కాలం నాటి వాతావరణం, పరిసరాలు, భవనాలను సెట్‌గా వేయాలంటే చాలా టైం తీసుకుంటుందని భావించిన డైరెక్టర్ క్రిష్ అండ్ టీమ్ రాజరికానికి చిరునామా లాంటి మొరాకో అయితే సెట్ వేయకుండా సరిపోతుందని యాక్షన్ పార్ట్‌ని అక్కడ షూట్ చేసి..వాటిని విజువల్ ఎఫెక్ట్‌తో టచప్ చేయాలని నిర్ణయించుకున్నారు. మే తొలి వారంలో మొరాకో చేరుకునే బాలయ్య..దాదాపు నెల నుంచి 40 రోజుల పాటు అక్కడే ఉంటారట. అక్కడే దాదాపు హాఫ్ మూవీ కంప్లీట్ చేసి మిగతాది ఇండియాలో ఫినిష్ చేసి సినిమాని ఆరు నెలల్లో రిలీజ్ చేయ్యాలని సినిమా యూనిట్ పట్టుదలగా ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



