ఐ లవ్ హైదరాబాద్ ముగింపు సభకు నందమూరి బాలకృష్ణ
on Jun 24, 2011
"ఐ లవ్ హైదరాబాద్" ముగింపు సభకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా వెళ్ళనున్నారని సమాచారం. వివరాల్లోకి వెళితే "ఐ లవ్ హైదరాబాద్" ముగింపు సభ జూన్ 26 వ తేదీ ఆదివారంనాడు, శిల్పకళావేదికలో జరుగనుంది. "ఐ లవ్ హైదరాబాద్" ముగింపు సభకు ముఖ్య అతిథిగా ప్రముఖ తెలుగు సినీ హీరో, నందమూరి నటసింహం, యువరత్న నందమూరి బాలకృష్ణ విచ్చేయనున్నారు.
.jpeg)
ఈ "ఐ లవ్ హైదరాబాద్" ముగింపు సభలో ఇండియన్ ఐడల్ గా గెలిచిన హైదరాబాద్ గాయకుడు శ్రీరామ్ సంగీత విభావరి నిర్వహించనున్నాడు. అంటే తన పాటలతో శ్రీరామ్ ఆహూతులను అలరించనున్నాడు. స్వగ్రామం ఏదైనా ఒకసారి హైదరాబాద్ కి వచ్చి సెటిలయ్యాక హైదరాబాద్ నగరం మీద అనుకోకుండానే ప్రేమకలగటం సహజం. దీనితో ప్రేరణ పొందే "ఐ లవ్ హైదరాబాద్" అనే ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఆ "ఐ లవ్ హైదరాబాద్" ఉద్యమం ముగింపు సభ ఇప్పుడు జరుగబోతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



