Home

»

Latest News

నందమూరి బాలకృష్ణకు ప్రమాదం.. ఫ్యాన్స్‌లో ఆందోళన.. అసలు ఏమైందంటే.?

Jul 21, 2026 1:18PM


నటసింహం నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్‌కు తీవ్ర ఆందోళన కలిగించే వార్త ఒకటి ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఆయన నటిస్తున్న మోస్ట్ ఏవైటెడ్ ప్రాజెక్ట్ NBK 111 షూటింగ్ సెట్‌లో అనుకోకుండా ప్రమాదం చోటుచేసుకుంది. 

కాకినాడ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. విరామం లేకుండా సాగుతున్న ఈ షూటింగ్ షెడ్యూల్‌లో.. మంచు మనోజ్, బాలకృష్ణ మధ్య యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా.. అనుకోకుండా బాలకృష్ణ స్లిప్ అయ్యి కిందపడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో బాలకృష్ణ మోకాలికి స్వల్ప గాయమైంది. కాకినాడ పోర్ట్ వద్ద జరుగుతున్న షూటింగ్ స్పాట్‌లో ఈ ఘటన చోటుచేసుకోగానే, వెంటనే అప్రమత్తమైన చిత్ర యూనిట్ సభ్యులు బాలయ్యను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆయనను పరీక్షించి ప్రాథమిక చికిత్స అందించారు.

అయితే, బాలకృష్ణ మోకాలికి తగిలిన గాయం చాలా స్వల్పమైనదేనని, అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు వెల్లడించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన కోలుకుంటున్నారని, విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని తెలిపారు. ప్రస్తుతం కాకినాడ పోర్టులోనే బాలకృష్ణ విశ్రాంతి తీసుకుంటున్నారు.

 

Nandamuri Balakrishna, Injury, NBK 111, Kakinada Port shooting

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com