
నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మోస్ట్ వెయిటెడ్ ప్రాజెక్ట్ NBK 111 చిత్రీకరణ కాకినాడ తీరప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. అత్యంత భారీ స్థాయిలో డిజైన్ చేసిన ఒక కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్న సమయంలో అనుకోకుండా ఒక చిన్న ప్రమాదం చోటుచేసుకుంది. ఈ పోరాట సన్నివేశంలో పాల్గొంటున్న సమయంలో బాలకృష్ణకి గాయమైంది.
ఈ వార్త కాకినాడ సెట్ నుంచి బయటకు రావడమే ఆలస్యం, నందమూరి అభిమానుల్లో తీవ్ర ఆందోళన రేగింది. నటసింహానికి ఏమైందో అని ఫ్యాన్స్ తీవ్రంగా కంగారు పడుతున్న తరుణంలో, NBK 111 చిత్ర యూనిట్ సభ్యులు ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసి ఈ విషయంపై పూర్తి స్పష్టతనిచ్చారు.
#NBK111 షూటింగ్ కాకినాడలో జరుగుతున్న సమయంలో ఓ యాక్షన్ సీక్వెన్స్ లో బాలకృష్ణకి చిన్న మజిల్ టియర్ (కండరాల చిట్లిపోవడం) అయింది. వైద్యుల సూచన మేరకు, ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవడానికి ఒక చిన్న మైనర్ సర్జరీ చేయించుకోబోతున్నారని స్పష్టం చేశారు.
"సినిమాపై ఆయనకున్న క్రమశిక్షణ, కష్టపడే తత్వం #NBK111 చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ ఎంతో స్ఫూర్తినిస్తుంది. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్‌లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం." అని టీమ్ ప్రకటనలో పేర్కొంది.
శస్త్రచికిత్స అనంతరం చిన్నపాటి విశ్రాంతి తీసుకుని బాలకృష్ణ త్వరలోనే మళ్లీ షూటింగ్ సెట్‌లోకి అడుగుపెడతారని సమాచారం.
Nandamuri Balakrishna, Injury, Surgery, NBK111, Kakinada Shooting






