Home

»

Latest News

యష్ మాట తప్పాడు.. టాక్సిక్ రొమాన్స్ వెనుక అసలు నిజాలివే!

Jul 21, 2026 1:02PM


సినిమా.. ఈ విశ్వంలో సినిమా ఇచ్చే ఆనందం మరొకటి ఉండదు. బహుశా సినిమాని మించిన గొప్పది ఇంక రావడానికి ఆస్కారం కూడా లేదు. అటువంటి సినిమాని కుటుంబ సమేతంగా వెళ్లి చూసే వాళ్ళు ఎంతో మంది. ఒక రకంగా కుటుంబ సమేతంగా వెళ్లి చూసే వాళ్ళు ఉన్నప్పుడే సినిమాకి భారీ విజయం లభిస్తుంది. కానీ శృంగారాన్ని వేరే కోణంలో చూపిస్తూ శృతిమించిన సినిమాలు రావడంతో వాళ్ల సంఖ్య తగ్గింది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చర్చకి వస్తుందంటే కాసేపటి క్రితం యష్ టాక్సిక్ నుంచి సాంగ్ రిలీజ్ అయ్యింది. సాంగ్ ని చూసిన వాళ్ళందరూ చాలా బోల్డ్ గా ఉందని చెప్తున్నారు. 


దీంతో  యష్ ఒకప్పుడు ఒక బహిరంగ సభలో మాట్లాడిన మాటలని సోషల్ మీడియా వేదికగా గుర్తు చేస్తున్నారు. యష్ మాట్లాడుతు 'నేను చేసే ప్రతీ సినిమా నా తల్లిదండ్రులతో, నా కుటుంబంతో కలసి హాయిగా థియేటర్‌లో కూర్చుని చూడగలిగేలా ఉండాలి. ఎక్కడా అసభ్యతకు తావులేకుండా, అందరూ మెచ్చే కథలనే ఎంచుకుంటాను అని చెప్పాడు. కానీ టాక్సిక్ నుంచి రిలీజ్ అవుతున్న ప్రతి కంటెంట్ శృతిమించిన శృంగారంతో ఉంటుంది. ఎన్ని విమర్శలు వస్తున్నా సరే మేకర్స్ మాత్రం టాక్సిక్ లో రొమాన్స్ ఫ్రీ అనే విధంగా తమ ప్రచార చిత్రాలని రిలీజ్ చేస్తున్నారు. ఇపుడు రిలీజైన సాంగ్ పరిస్థితి కూడా అంతే.

Also read: తల్లి పేరు నిలబెడుతుందా.. తెలుగు ప్రేక్షకులు ఎలాంటి వారంటే!


దీంతో యష్ గతంలో మాట్లాడిన మాటలని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‌ ని  దృష్టిలో ఉంచుకుని సినిమాలు తీస్తానని చెప్పిన హీరో, ఇప్పుడు 'A Fairy Tale for Grown-ups'అనే ట్యాగ్‌లైన్‌తో ఇంత బోల్డ్ మరియు డార్క్ లవ్ స్టోరీని ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్న కూడా  అందరిలోనూ మెదులుతోంది.  

yash, toxic, kiara adwani, geethu mohan das
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com