.webp)
నటనే నానాపటేకర్ కి డై హార్డ్ ఫ్యాన్ అనే మాట అభిమానులు, సినీ ప్రేమికుల నుంచి వినిపిస్తూ ఉంటుంది. అంతలా ఎన్నో అద్దుతుమైన క్యారెక్టర్స్ పోషించి ఎంతో మంది నటులకి నట గురువు అయ్యాడు. డైలాగ్ డెలివరీ కూడా డిఫరెంట్
నానా పటేకర్ తన చివరి కోరికగా పుణె సమీపంలోని డోంజే గ్రామంలో ఉన్న తన సొంత వ్యవసాయ క్షేత్రంలోనే తుది వీడ్కోలు పొందాలని ఆశించారు. ఆ ఫామ్‌హౌస్‌తో ఆయనకు ఎంతో భావోద్వేగ అనుబంధం ఉండేది. కుటుంబ సభ్యులు ఆయన చివరి ఆకాంక్షను గౌరవిస్తూ అంత్యక్రియల ఏర్పాట్లని అక్కడే పూర్తి చేస్తున్నారు. పుణె జిల్లా కలెక్టర్ జితేంద్ర దూడి ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గోవా నుంచి ఆయన భౌతికకాయాన్ని ప్రత్యేక మార్గంలో పుణెలోని ఫామ్‌హౌస్‌కు తరలించి, సాయంత్రం వేళ ప్రభుత్వ లాంఛనాలతో, అధికారిక నివాళులతో అంత్యక్రియలు పూర్తి చేయనుంది. భారతీయ సినిమాకి ఆయన అందించిన అసమానమైన సేవలకు, విశిష్టమైన కళాకృతికి గౌరవసూచకంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించగా, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ఆశిష్ షెలార్ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు.
.webp)
ఇది కూడా చదవండి: 1350 కోట్లు హుష్ కాకి: టామ్ క్రూజ్ ‘డిగ్గర్’ మూవీ డిజాస్టర్ ఫలితం!
నానా పటేకర్ కేవలం వెండితెరపై మెరిసే నటుడు మాత్రమే కాదు; ఆయన ఒక నిజమైన సమాజ సేవకుడు. సుమారు 27 ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయం చేస్తూ, అందులో వచ్చే ఆదాయంలో అత్యధిక భాగాన్ని కరువు బారిన పడిన రైతులకు, పేద కుటుంబాలకు విరాళంగా ఇచ్చేవారు. నామ్ ఫౌండేషన్ (Naam Foundation) ద్వారా వేలాది మంది రైతు కుటుంబాలకు అండగా నిలిచి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. 'పరిందా', 'ప్రహార్', 'తిరంగా', 'అగ్నిసాక్షి', 'ఖమోషి', 'అబ్ తక్ ఛప్పన్', 'వెల్కమ్', 'రాజనీతి', 'నటసమ్రాట్' వంటి అనేక చిరస్మరణీయ చిత్రాల్లో ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ సజీవంగా ఉంటాయి. 1991లో 'ప్రహార్' చిత్రంతో దర్శకుడిగా, రచయితగా కూడా ఆయన తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు.
[Nana Patekar Funeral Pune State Honours, Nana Patekar, Nana Patekar funeral, Nana Patekar death, Nana Patekar Pune farmhouse, State Honours,Telugu Cinema News, Telugu Cinema, Tollywood News, Tollywood]






