
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు దర్శకుడు వశిష్టతో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అధికారికంగా ఖరారైన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్న ఈ సినిమాపై ఇప్పుడు క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం.. ఈ ఏడాది డిసెంబర్ మొదటి వారంలో సినిమాను లాంఛనంగా ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. పూజా కార్యక్రమాలతో ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేసి.. ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో బాలకృష్ణ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారనే టాక్ ఇప్పుడు మరింత ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కథ కీలక మలుపు తిరిగే సమయంలో బాలయ్య ఎంట్రీ ఉంటుందని, మోక్షజ్ఞకు తండ్రి పాత్రలోనే కనిపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
అదే నిజమైతే.. ఒకే ఫ్రేమ్‌లో బాలయ్య, మోక్షజ్ఞలను చూడాలనుకుంటున్న నందమూరి అభిమానులకు ఇది భారీ ట్రీట్ అవుతుంది.

గతంలో మోక్షజ్ఞ డెబ్యూ కోసం ప్రశాంత్ వర్మతో ప్రాజెక్ట్ అనౌన్స్ అయినా అది ముందుకు వెళ్లలేదు. దీంతో ఇప్పుడు వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా విషయంలో నందమూరి ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
అన్నీ అనుకున్నట్టుగా జరిగితే డిసెంబర్‌లో ప్రాజెక్ట్ లాంచ్.. ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. మోక్షజ్ఞను వశిష్ట ఎలాంటి పాత్రలో చూపించబోతున్నారు? బాలయ్య నిజంగానే సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తారా? అనేది ఇప్పుడు అసలు ఆసక్తిగా మారింది.
ఇది కూడా చదవండి: నానా పటేకర్ రియల్ హీరో.. కార్గిల్ యుద్ధంలో 60 రోజులు ఏం చేశారంటే.?
[Nandamuri Mokshagna Debut Movie Launch, Nandamuri Mokshagna Debut Shooting, Nandamuri Mokshagna, Nandamuri Balakrishna, Director Vassishta, Mythri Movie Makers, Telugu Film News]




.webp)
