నీతోనే నిజమైన ప్రేమను అనుభవిస్తున్నా!
on Aug 9, 2020

ప్రేమలో ఉన్నప్పుడు కలిగే ఆనందాన్ని మించిన ఆనందం ఏదీ ఉండదు. ప్రేమ ఇచ్చే శక్తి అసాధారణం. ప్రేమలో లేనప్పటి రోజులతో ప్రేమలో ఉన్నప్పటి రోజుల్ని పోల్చుకుంటే మనకు మనమే కొత్తగా అనిపిస్తాం. అంతగా మనం మారిపోతాం. ప్రేమ మహత్యం అలాంటిది. అన్ని రకాల బాధల్నితీర్చే దివ్యౌషధం ప్రేమ. 'వంశీ' సినిమా సెట్స్‌పై అలాంటి ప్రేమలో పడ్డారు మహేశ్, నమ్రతా శిరోద్కర్. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. వాళ్ల ప్రేమకు ఫలంగా ఇద్దరు పిల్లలు కలిగారు.
2005లో మహేశ్, నమ్రత ముంబైలో పెళ్లి చేసుకున్నారు. మహేశ్ అప్పుడు 'అతడు' సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. రాత్రంతా ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొని, సన్నివేశాలు పూర్తిచేసి, అప్పుడు ముంబైకి బయలుదేరి వెళ్లి నమ్రతను తనదాన్ని చేసుకున్నానని ఆ తర్వాత మహేశ్ చెప్పాడు.
ఆగస్ట్ 20న మహేశ్ 45వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఓ ఎమోషనల్ పిక్చర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు నమ్రత. అందులో నమ్రత నుదుటి మీద ప్రేమగా ముద్దుపెట్టుకుంటున్నాడు మహేశ్. అది నమ్రత తీసిన సెల్ఫీ ఫొటో. దాంతో పాటు "True love is how I experience it with YOU. Happy Birthday MB. I love you, now and always. @urstrulymahesh. అని ఆమె రాసుకొచ్చారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



