18 ఏళ్ళ `శివమణి`!
on Oct 23, 2021

``నా పేరు శివమణి.. నాక్కొంచెం మెంటల్..`` అంటూ కింగ్ నాగార్జున సందడి చేసిన చిత్రం `శివమణి 98480 22338`. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ కాప్ యాక్షన్ డ్రామాలో.. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ `శివమణి`గా టైటిల్ రోల్ లో ఎంటర్టైన్ చేశారు నాగ్. అతనికి జోడీగా అసిన్, రక్షిత నటించిన ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, సంగీత, అలీ, మోహన్ రాజ్, బెనర్జీ, వినోద్ బాల, బ్రహ్మాజీ, ఎమ్మెస్ నారాయణ, ఏవీయస్, బండ్ల గణేశ్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
చక్రి బాణీలందించిన ఈ చిత్రానికి కందికొండ, భాస్కరభట్ల, విశ్వ, చక్రి సాహిత్యమందించారు. ``మోనా మోనా``, ``రామా రామా``, ``ఏనాటికి``, ``సున్ సున్ సుందరి``, ``ఏలో ఏలో``, ``గోల్డ్ రంగు``.. ఇలా ఇందులోని గీతాలన్ని ప్రేక్షకులను రంజింపజేశాయి. వైష్ణో అకాడమీ పతాకంపై పూరీ జగన్నాథ్ స్వయంగా నిర్మించిన ఈ సినిమాకి డీవీవీ దానయ్య సమర్పకుడిగా వ్యవహరించారు. పూరి కథను సమకూర్చగా కోన వెంకట్ సంభాషణలు అందించారు. ఈ చిత్రానికిగానూ ఎమ్మెస్ నారాయణ `ఉత్తమ హాస్య నటుడు`గా `నంది` పురస్కారాన్ని అందుకున్నారు. 2003 అక్టోబర్ 23న విడుదలై మంచి విజయం సాధించిన `శివమణి`.. నేటితో 18 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



