నాగ్ బట్టతలను ఎలా జయించాడు
on Jan 24, 2017

కింగ్ నాగార్జున..అరవైకి దగ్గర పడుతున్నా కూడా ఇంకా నలభైలలో ఉన్నట్లే యంగ్‌గా ఉంటారు.. కొడుకులతో కింగ్ పక్కన నడుస్తుంటే అన్నదమ్ములు కలిసి వెళుతున్నట్లే ఉంటుంది కానీ తండ్రి కొడుకులు అన్న ఫిలింగ్ రాదు..అంతలా తన అందాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు నాగార్జున..అలాంటి నాగార్జునని బట్టతల భయపెట్టిందట.. ఈ విషయాన్ని స్వయంగా నాగ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
అప్పుడు నాకు 28 ఏళ్లు..ఆ వయసులో జుట్టు బాగా పలుచబడి పోయింది..వెంట్రుకలు బాగా రాలిపోయేవి..నాన్న, అన్నయ్యలాగే నాకు బట్టతల వచ్చేస్తుందని చాలా భయపడ్డాను..కానీ ఏం చేయను..ఇప్పటిలా అప్పుడు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ట్రీట్‌మెంట్స్ లేవు. జుట్టును ఒత్తుగా చేసే ఓ తైలం కేరళలో దొరుకుతుందని ఓ మళయాళ నటుడు చెప్పడంతో దానిని తెప్పించుకుని తలకు పెట్టుకున్నాను. కానీ ఆ నూనెని చేత్తో పెట్టుకుంటే మాత్రం..చేతికి నల్లగా రంగు అంటుతుంది..రెండు మూడు రోజులైనా ఆ రంగు వదిలేది కాదు..దీంతో చేతికి గ్లావ్స్ వేసుకుని నూనె పెట్టుకునేవాడిని. అది వాడిన తర్వాత జుట్టు కాస్తంత ఒత్తుగా మారింది. ఆ జుట్టు ఇప్పటికీ ఊడలేదు.. ఆ పట్టుదల కారణంగా తనకు బట్టతల రాలేదని చెప్పారు నాగార్జున.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



