నాగ్ భక్తిరస చిత్రంలో మెగా హీరోయిన్
on Apr 25, 2016

మెగా హీరో వరుణ్ తేజ్ సరసన "కంచె" మూవీలో నటించిన ప్రగ్యా జైస్వాల్‌కు గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. అది కూడా ఏకంగా టాలీవుడ్ కింగ్ నాగార్జున పక్కన నటించే లక్కీ చాన్స్. "మిర్చి లాంటి కుర్రాడు" సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ప్రగ్యా జైస్వాల్‌కు "కంచె" ద్వారా పాపులారిటీ వచ్చింది. ఆ సినిమాలో తన అందంతో, అభినయంతో అటు ప్రేక్షకులను, విమర్శకులను ఆకట్టుకుంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, నాగార్జున కాంభినేషన్‌లో రానున్న భక్తిరస చిత్రంలో ప్రగ్యాను ఎంపిక చేసినట్లు ఫిల్మ్‌నగర్ టాక్. అయితే ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. శ్రీవెంకటేశ్వరుని పరమ భక్తుడైన హాథీరామ్ బాబా జీవిత చరిత్రతో ఈ చిత్రం రానుంది. ఈ సినిమాలో హాథీరాం బాబాగా నాగార్జున నటించనున్నారు. ప్రజంట్ ఈ మూవీ పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రానికి నమో వెంకటేశాయ అనే పేరును పరిశీలిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



