ENGLISH | TELUGU  

నాగబాబు నోట... ‘జబర్దస్త్‌’ను దెబ్బ కొట్టలేరనే మాట!

on Dec 23, 2019

‘ఎవరూ ఎవరి షోను దెబ్బ తీయలేరు’ – ఇదీ తాజాగా మెగా బ్రదర్‌, నవ్వుల నటరాజు నాగబాబు నోట వచ్చిన మాట! యుట్యూబ్‌లో ఆయనకు ‘నా ఇష్టం’ ఛానల్‌ ఉన్న సంగతి తెలిసిందే. తన అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ఆయన దాన్ని వేదికగా వాడుకుంటున్నారు. ఎలక్షన్‌ టైమ్‌లో ఆయన చేసిన పొలిటికల్‌ స్కిట్లు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయ్యాయి. ‘జబర్దస్త్‌’ నుండి ఆయన బయటకు వచ్చేశాక... ‘నా ఇష్టం’ ఛానల్‌లో నాగబాబు వెల్లడిస్తున్న విషయాలను ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. తాజాగా ‘జబర్దస్త్‌’, ‘అదిరింది’ షోస్‌ గురించి ఆయన మాట్లాడారు.

‘‘ఎవరి షోనూ ఎవరు దెబ్బ కొట్టలేరు. ‘జబర్దస్త్‌’ షో పాపులర్‌. బయటకొచ్చి ఎవరూ ఆ షోను దెబ్బ కొట్టేంత పరిస్థితి ఉండదు. అలాగే, కొత్త కామెడీ షోను చూడరనే ఆలోచన కూడా అక్కర్లేదు. ఒక కన్విక్షన్‌తో, ప్రోపర్‌ స్టాండర్డ్స్‌తో ప్రజెంట్‌ చేయగలిగితే... కామెడీ షోను ఎంజాయ్‌ చేయడానికి ప్రజలు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. కామెడీ, క్రియేటివిటీ అనేది ఒక వ్యక్తితోటో, సంస్థతోటో, ఒక ఛానల్‌తో ఆగదు. బెస్ట్‌గా ప్రజెంట్‌ చేస్తే ఆదరణ ఉంటుంది’’ అని నాగబాబు పేర్కొన్నారు. ఆయన మాటలకు... షోలో డైలాగులకు ఎంతో తేడా ఉండడమే ఇక్కడ టాపిక్‌. ‘అదిరింది’ ప్రొమోల్లో డైలాగులు ‘జబర్దస్త్‌’ను టార్గెట్‌ చేసే విధంగా ఉన్నాయి. ఒక రకంగా టీజ్‌ చేస్తున్నారని చెప్పుకోవాలి.

‘ఎంతమంది ఉన్నారన్నది కాదురా... ఎవడున్నాడన్నది ముఖ్యం. మొదలు పెట్టండి’ – ఇదీ ‘అదిరింది’ ఫస్ట్‌ ప్రొమోలో నాగబాబు డైలాగ్‌. ‘జబర్దస్త్‌’లో ఎంతమంది ఉన్నా... ‘అదిరింది’లో నాగబాబు ఉన్నారన్నది ముఖ్యమనే విషయాన్ని పరోక్షంగా చెప్పారు.

‘అప్పుడే అయిపోయిందనుకోకు... ఇప్పుడే మొదలైంది. ఇప్పుడే మొదలైంది’ – ఇదీ ‘అదిరింది’ మరో ప్రొమోలో డైలాగ్‌. దీనిని ఒక షోకి గెస్ట్‌ జడ్జ్‌గా వచ్చిన నిహారిక కొణిదెలతో కూడా చెప్పించారు. ప్రోమో ఎండింగ్‌లో నాగబాబు వస్తుంటే ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’లో ‘ఆడెవడన్నా... వీడెవడన్నా... సర్దార్‌ అన్నకు అడ్డు ఎవడన్నా’ పాట వేశారు. నాగబాబుకు ఎవరు అడ్డు లేరన్నది ‘జబర్దస్త్‌’ షో డైరెక్టర్లుగా మానేసి ‘అదిరింది’ షోని డైరెక్ట్‌ చేస్తున్న నితిన్‌–భరత్‌ అభిమతం కావొచ్చు. ‘అదిరింది’ షోలో ఇన్‌డైరెక్ట్‌గా ‘జబర్దస్త్‌’ను టార్గెట్‌ చేస్తున్నారు. నాగబాబు ఏమో ‘నా ఇష్టం’లో ఇలా మాట్లాడుతున్నారు. అదీ సంగతి.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.