వేరేవాళ్లు ఎదవలనా.. వేలు పెడతాం.. పూలు వేయించుకుంటాం.. రాళ్ళూ కొట్టించుకుంటాం
on Jul 6, 2023

"రంగబలి" మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా నాగశౌర్య నిఖిల్ తో నాటకాలు షోలో పాడ్కాస్ట్ ని స్టార్ట్ చేసి ఇండస్ట్రీకి సంబంధించి ఎన్నో విషయాలను చెప్పారు. "ఏ అవార్డు ఫంక్షన్ కి వెళ్లవు...ఫిలిం ఫేర్, సైమా వంటి ఏ అవార్డ్స్ నువ్వు తీసుకోవు...చాలా మంది హీరోస్ అవార్డ్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ అవార్డ్స్ నిజమేనా" అని నిఖిల్ అడిగేసరికి "అబద్దం అని చెప్పడానికి నా దగ్గర ఏ ప్రూఫ్ లేదు. అవార్డు అనేది జెలస్ ఫీల్ తెప్పించేది. థి బెస్ట్ యాక్టర్ అంటూ కొంతమందికి అవార్డు ఇస్తే వేరేవాళ్లు ఎదవలనా..కాదు కదా. ఆ మూవీ తీసిన డైరెక్టర్ కి అవార్డు ఇవ్వాలి అంటున్నా..
ది బ్రెడ్ క్రియేటింగ్ యాక్టర్ గోస్ టు అంటూ ఆ మూవీ డైరెక్టర్ కి ఇవ్వాలి..కానీ ఎందుకు ఇవ్వరో తెలీదు. నేను సినిమాకు కష్టపడినట్టే అందరూ కష్టపడతారు. ఐతే అవార్డు వచ్చినంత మాత్రాన మాకేమీ రెమ్యూనరేషన్ పెంచరు..." అని చెప్పారు శౌర్య..."ఇండస్ట్రీలో టాక్ ఏంటంటే చాలామంది హీరోస్ అన్ని విషయాల్లో వేలు పెడుతూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం" అని అడిగాడు నిఖిల్. "హీరో అండేవాడు పేస్ ఆఫ్ ది ఫిలిం...ఆడియన్స్ సినిమా చూడాలంటె తెలిసిన యాక్టర్ ఐనా, డైరెక్టర్ ఐనా ఉంటే ఎక్కువగా చూడడానికి ఇష్టపడతారు. వీళ్ళ మీదే బిజినెస్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటే ఆ మూవీ కచ్చితంగా హిట్ కొడుతోంది.
ఇక మేము వేలు పెడుతున్నాం అంటే ఉదయం నుంచి రాత్రి వరకు షూటింగ్స్ లోనే ఉంటాం. మాకు తెలిసిన జాబ్ అదే. అందులో అన్ని డిపార్ట్మెంట్స్ ని ఫాలో అవుతూ ఉంటాం. పాత వాళ్ళ నుంచి కొత్త వాళ్ళ వరకు అందరికి అన్ని విషయాలు తెలుసు కాబట్టి తప్పు జరుగుతున్నప్పుడు వెళ్లి చెప్తారు. దానికి వేలు పెట్టడం అని కాదు కదా అర్ధం. డైరెక్టర్స్, రైటర్స్ చాలా తక్కువ చేసి ఉంటారు కానీ యాక్టర్స్ చాలా మూవీస్ చేసి ఉంటారు కాబట్టి వాళ్లకు చాలా విషయాల మీద అవగాహన ఎక్కువగా ఉంటుంది. ఇంకో విషయం ఏమిటి అంటే ఫలానా హీరో సినిమా ఫ్లాప్ అయ్యింది అని రాస్తారు ఫలానా డైరెక్టర్ మూవీ ఫ్లాప్ అయ్యింది అని రాయరు. కాబట్టి పేరు మేమే తీసుకుంటాం..రాళ్లు కూడా మేమే కొట్టించుకుంటాం. ఆ నొప్పి మాకు తెలుసు కాబట్టి జాగ్రత్త పడడానికి ట్రై చేస్తూ ఇలా మాకు తెలిసినవి చెప్తూ ఉంటాం. నా సినిమా ఫ్లాప్ అవ్వాలని నేను కోరుకొను కదా. మనం బాగున్నామంటే కిందకి పడేయాలని కోరుకునే వాళ్లే ఎక్కువగా ఉంటారు." అని చెప్పారు శౌర్య.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



