
ఈ వేసవిని మరింత వేడెక్కించనున్నాయి టాలీవుడ్ చిత్రాలు. అవును ఈ వేసవి బరిలో మరిన్ని సినిమాలు సందడి చేయనున్నాయి. ఏప్రిల్ మొదటి వారం నుంచి జూన్ రెండో వారం వరకు ఈ సందడి కొనసాగనుంది. ఏప్రిల్ 5న నాగచైతన్య, సమంత జంటగా నటించిన `మజిలీ` తో హంగామా మొదలవుతుంది. రియల్ లైఫ్ లో ఒకటైన ఈ జంట రీల్ లైఫ్ లో కూడా భార్యభర్తులుగా నటిస్తోన్న చిత్రం కాబట్టి ఈ సినిమాపై అందరికీ ఆసక్తి ఏర్పడింది. ఇక అదే నెలలో 12న సాయి ధరమ్ తేజ్ `చిత్రలహరి` విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈచిత్రానికి కిషోర్ తిరుమల దర్శకుడు. మైత్రీ వారు నిర్మిస్తుండటంతో ఈ సినిమా పై అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే ఏప్రిల్ లోనే నాని సినిమా ``జెర్సీ` కూడా రానుంది. 19న రానున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందడంతో భారీ అంచనాలున్నాయి. ఇక మొదట ఏప్రిల్ 5న విడుదల చేయాలనుకున్న `మహర్షి` మే 9కి వెళ్లింది. ఈ సినిమా సమ్మర్ లో విడుదల కానున్న భారీ చిత్రంగా చెప్పవచ్చు. మహేష్ 25వ సినిమా కావడంతో అందరు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇక సెన్సేషనల్ హీరో విజయ్ దే వరకొండ, రష్మిక నటించిన `డియర్ కామ్రేడ్` మే 22న విడుదల కానుంది. గీత గోవిందంతో సక్స్ స్ ఫుల్ కాంబినేషన్ గా పేరు తె చ్చుకున్న విజయ్, రష్మిక మరోసారి జంటగా నటించారు. దీనిపైన కూడా చాలా హోప్స్ ఉన్నాయి. ఇక పూరి జగన్నాథ్ , రామ్ కలయికలో వస్తోన్న `ఇస్మార్ట్ శంకర్ ` తొ పాటు శర్వానంద్ , సుధీర్ వర్మ కలయికలో వస్తోన్న సినిమా కూడా మే నెలలోనే విడుదల చేయనున్నట్లు తె లుస్తోంది. మరి ఈ వేసవిలో ఎవరు సక్సెస్ కొడతారో చూద్దాం.






