Home

»

Latest News

చెర్రీకి బ‌న్నీ గిఫ్ట్!!

Mar 8, 2019 3:30PM

రామ్ చ‌ర‌ణ్ మార్చి 27న పుట్టిన రోజు జ‌రుపుకోనున్నాడు. ఇప్ప‌టికే మెగా ఫ్యాన్స్ ఆ సెల‌బ్రేష‌న్స్ గ్రాండ్ గా జ‌ర‌ప‌డానికి ప్లాన్ చేస్తున్నారు.  అదే రోజున రాజ‌మౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంబంధించి రామ్ చ‌ర‌ణ్ లుక్ ని రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు కూడా స‌మాచారం అందుతోంది. ఇదిలా ఉంటే  చ‌ర‌ణ్ కు బన్నీ ఓ గిఫ్ట్ ఇవ్వ‌బోతున్నాడ‌ట‌. ఒక‌సారి ఆ వివ‌రాల్లోకి వెళితే....బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో ఓ సినిమా రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ సినిమ‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్ష‌న్  పనుల‌న్నీ పూర్తయ్యాయి. అయితే ఈ సినిమాను చ‌ర‌ణ్ బ‌ర్త్ డే రోజున షూటింగ్ ప్రారంభించి అదే రోజు  సెట్స్ మీద‌కు వెళ్లాల‌ని ప్లాన్ చేసార‌ట బ‌న్నీ.  ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్  హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇద‌న్న మాట బ‌న్నీ చ‌ర‌ణ్ కు ఇచ్చే గిఫ్ట్. మ‌రి రాజ‌మౌళి ఇచ్చే గిఫ్ట్ ఎలా ఉంటుందో లేదో ఉంటే ఎలా ఉంటుందో అన్న ఆస‌క్తి ఇప్ప‌టి ఫ్యాన్స్ లో మొద‌లైంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com