Home

»

Latest News

`అర్జున్ రెడ్డి` కాంబినేష‌న్ రిపీట్ !!

Mar 8, 2019 3:11PM

`అర్జున్ రెడ్డి` చిత్రం  విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్ ను ఓ రేంజ్ కు తీసుకుళ్లిన విష‌యం తెలిసిందే. ఆ చిత్రం తర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. ఆ సినిమాతో హీరోయిన్ గా ప‌రిజ‌య‌మైంది షాలిని పాండే. ఈ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, షాలిని పాండే మ‌ధ్య కెమిస్ట్రీ ఎంత‌గా వ‌ర్క‌వుట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో మ‌రో సినిమా రాబోబుతున్న‌ట్లు వార్తలు వ‌స్తున్నాయి. మైత్రి మూవీ మేక‌ర్స్ లో ఆనంద్ అన్నామ‌లై అనే ఓ యంగ్ డైర‌క్ట‌ర్ స్ట్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా విజ‌య దేవ‌ర‌కొండ‌తో చేయ‌బోతున్న‌ట్లు ఇటీవ‌ల వార్త‌లు జోరుగా వ‌చ్చిన విష‌యం తెలిసిందే. బైలింగ్వెల్ గా తెర‌కెక్క‌నున్న ఈ  క్రేజీ ప్రాజెక్ట్ లో బైక్ రేస‌ర్ గా విజ‌య్ దేవ‌ర‌కొండ క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం. ఇప్ప‌టికే ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా మాళ‌విక మోహ‌న్ ని ఫైన‌ల్ చేసార‌ట‌. ఇక మెయిన్ హీరోయిన్ గా షాలిని తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో సినిమా కోసం ఆడియ‌న్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మ‌రి అర్జున్ రెడ్డి లో ఈ  జంట చేసిన మెస్మ‌రైజ్ ఈ సినిమాలో చేస్తారో లేదో చూద్దాం. ప్ర‌స్తుతం మైత్రీ మూవీ మేక‌ర్స్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ `డియ‌ర్ కామ్రేడ్ చేస్తున్నాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com