చైతన్యకి జోడీ దొరికేసిందా!
on Aug 5, 2023

టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య తన లేటెస్ట్ మూవీని దర్శకుడు చందు మొండేటి కలిసి చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు తను చేసిన సినిమాలకు భిన్నంగా చైతు ఈ సినిమాలో జాలరి పాత్రలో కనిపించబోతున్నారు. సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తను చేయబోయే పాత్ర కోసం ఇప్పటికే చైతన్య వైజాగ్ సముద్ర తీరంలో ఉంటూ చేపలు పట్టే వ్యక్తులను కలిసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. గీతా ఆర్ట్స్ సంస్థలో భాగమైన జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మించనున్నారు.
శ్రీకాకుళం, గుజరాత్ బ్యాక్ డ్రాప్‌తో సినిమా తెరకెక్కనుంది. పాన్ ఇండియా మూవీగానే దీన్ని రూపొందించటానికి భారీ లెవల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి తండేల్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. జాలర్లు చేపలు పట్టటానికి వెళ్లే గ్రూపుకి నాయకుడిని తండేలు అంటారు కాబట్టి అదే టైటిల్‌ను పెట్టాలని మేకర్స్ ఆలోచనగా కనిపిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో ఆసక్తికరమైన వార్తొకటి నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే కథానాయకి పాత్ర. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే దానిపై చాలా పేర్లే పరిశీలనలోకి వచ్చాయి.
తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించనుంది. పర్టికులర్‌గా ఆమెనే హీరోయిన్‌గా ఎంచుకోవటానికి కారణం.. దసరా సినిమా తరహాలోనే హీరోయిన్ పాత్ర నేచురల్‌గా ఉంటుంది. కీర్తి సురేష్ అయితే ఆ పాత్రకు న్యాయం చేయటమే కాకుండా, చైతు, కీర్తి పాత్రలు ఫ్రెష్ లుక్‌ను తీసుకొస్తాయని మేకర్స్ భావిస్తున్నారు. చైతన్యకు గీతా ఆర్ట్స్‌తో మంచి అనుబంధమే ఉంది. తన కెరీర్‌కు బూస్టప్‌లాంటి 100% లవ్ సినిమాను నిర్మించింది గీతా ఆర్ట్స్ సంస్థే. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి గీతా ఆర్ట్స్‌లో చైతన్య వర్క్ చేస్తున్నారు మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



