నాన్న పోస్ట్‌కు నిన్న.. సమంత పోస్ట్‌కు నేడు రెస్పాండ్ అయిన చైతూ!
on Sep 14, 2021
'లవ్ స్టోరి' ట్రైలర్ రిలీజ్‌కు సంబంధించి నాన్న నాగార్జున చేసిన పోస్ట్‌కు వెంటనే రెస్పాండ్ అయిన నాగచైతన్య, భార్య సమంత చేసిన పోస్ట్‌కు మాత్రం ఇవాళ రెస్పాండ్ అవడం మరోసారి అందరి కనుబొమ్మల్నీ ముడివేసేలా చేసింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతూ, సాయిపల్లవి జంటగా నటించిన 'లవ్ స్టోరి' మూవీ ఈ నెల 24న థియేటర్లలో రిలీజవుతోంది. ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్‌ను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు చైతూ.
పలువురు సెలబ్రిటీలు ఆ ట్రైలర్‌ను ప్రశంసిస్తూ తమ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. అలా షేర్ చేసుకున్నవారిలో చైతూ తండ్రి నాగార్జున, భార్య సమంత కూడా ఉన్నారు. తండ్రి నాగ్‌తో పాటు దేవా కట్టా, నీరజ కోన, నాగశౌర్య, సుశాంత్, బీవీఎస్ రవి చేసిన పోస్ట్‌లకు నిన్ననే రెస్పాండ్ అయి, వారికి థాంక్స్ చెప్పాడు చైతూ.
వారితో పాటే సమంత కూడా తన పోస్ట్‌ను షేర్ చేసినా, ఆమె పోస్ట్‌ను ఇగ్నోర్ చేశాడు చైతూ. తన పోస్ట్‌లో చైతూ పేరును అసలు ప్రస్తావించకుండా సాయిపల్లవికీ, సినిమా టీమ్‌కూ విషెస్ తెలియజేసింది సామ్. అయితే తండ్రి, మరికొంతమంది సెలబ్రిటీల పోస్టులకు స్పందించిన చైతూ, భార్య పోస్ట్‌కు స్పందించకపోవడంతో, అందరూ దాన్ని పాయింట్ ఔట్ చేస్తూ, ఆ ఇద్దరి మధ్యా బంధం బీటలు వారిందనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలంటూ సోషల్ మీడియాలో కోడై కూశారు.
దాంతో ఏమనుకున్నాడో, ఏమో ఈరోజు ఉదయం సమంత పోస్ట్‌కు రెస్పాండ్ అయిన చైతూ, ఆమె పోస్ట్‌ను షేర్ చేసి, "థాంక్స్ సామ్" అని రాసుకొచ్చాడు.
ఆమెతో పాటు సుమంత్, డైరెక్టర్ బాబీల పోస్టులకు కూడా ఈరోజే స్పందించాడు. ఏదేమైనా తన పోస్టులో చైతూను సమంత ప్రస్తావించకపోవడం, ఆమె పోస్ట్‌కు నిన్ననే రెస్పాండ్ కాకుండా, అందరూ దాని గురించి చర్చించుకుంటుండంతో ఈరోజు స్పందించడం చూస్తే.. ఎవరికైనా వాళ్లు విడిపోనున్నారనే అనుమానాలు బలంగా కలగకుండా ఉండవు.
Also Read