అక్కినేని జయంతికి చైతూ ‘లవ్ స్టోరి’ ట్రైలర్!
on Sep 15, 2020
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని వంశానికి మూల పురుషుడు ఏయన్నార్. అక్కినేని నాగేశ్వరరావు సినిమాల్లో నటించాలనే కోరికతో ఇండస్ట్రీకి రావడం వల్ల, వచ్చిన తరవాత క్రమశిక్షణతో అంచెలంచెలుగా స్టార్‌గా ఎదగడం వల్ల తరవాత తరాలకు బలమైన పునాది పడింది. ఏయన్నార్ అంటే ఆయన తనయుడు నాగార్జునకు మాత్రమే కాదు... నాగార్జున తనయుళ్లు నాగచైతన్య, అఖిల్‌కీ అమితమైన గౌరవం, ప్రేమ. ప్రతి ఏడాదీ అక్కినేని జయంతికి తమ కొత్త సినిమా కబుర్లు ఏవో ఒకటి చెబుతుంటారు. ఈ ఏడాది ఏం కబురు చెప్పాలో నాగచైతన్య నిర్ణయించుకున్నాడని సమాచారం.
నాగచైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘లవ్ స్టోరి'కి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్. ఆల్రెడీ ఈ సినిమా టీజర్ విడుదలైంది. అందులో సాయి పల్లవి ముద్దు పెట్టినప్పుడు నాగచైతన్య కంట నీరు తిరిగే సన్నివేశం ప్రేక్షకుల హృదయాలను తాకింది. ఆ తరవాత మ్యూజికల్ ప్రివ్యూగా ‘ఏ పిల్లా’ సాంగ్ టీజర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు అక్కినేని జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 20న ‘లవ్ స్టోరి’ ట్రైలర్ విడుదల చేయాలనుకుంటున్నారట. అదీ సంగతి. ఈ నెల ప్రారంభంలో ఈ సినిమా బ్యాలెన్స్ షూటింగ్ ప్రారంభించారు. సినిమాను రెడీ చేసి, థియేటర్లు ఓపెన్ అయినప్పుడు విడుదల చేయాలనుకుంటున్నారు.
Also Read