
మెగాస్టార్ చిరంజీవి.. ఏ విషయంపైనైనా స్పందించడంలోను, తోటి వారిని అభినందించడంలోను ముందుంటారు. ఈ కోవలోనే రీసెంట్ గా ఎంతో మంది ప్రాణాలు కాపాడిన పైలెట్ 'స్మిత్ మచ్చర్' గురించి ట్వీట్ చెయ్యడం జరిగింది.
ఎక్స్ లో 'తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా, తోటి వారి ప్రాణాలను కాపాడాలనే సంకల్పంతో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన మన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు.ఇజ్రాయెల్‌కి వెళ్తున్న విమానంలో దాడికి గురై, తీవ్రంగా గాయపడిన స్థితిలోను సమయస్ఫూర్తితో స్పందించి, ఎందరో ప్రాణాలని ఒక్కడై పోరాడిన మీ సాహసం ప్రతి భారతీయుడికీ గర్వకారణం.
.webp)
ఆ క్లిష్ట సమయంలో హనుమాన్ చాలీసా పఠిస్తూ మనోధైర్యాన్ని కూడగట్టుకున్నారని తెలిసి నా మనసు చలించింది. ఆ ఆంజనేయస్వామి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని, మీరు త్వరగా పూర్తిగా కోలుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.మీ ధైర్యసాహసాలకు, మానవత్వానికి నా హృదయపూర్వక వందనాలు.జై హనుమాన్ అని ట్వీట్ చెయ్యడం జరిగింది.
సినిమాల పరంగా చూసుకుంటే చిరు ప్రస్తుతం 'కాకా' తో బిజీగా ఉన్నాడు.
[Chiranjeevi Tweet About smit machchhar, Chiranjeevi Latest Tweet, Chiranjeevi Latest Movie, Smit machchhar, Telugu Cinema News, TeluguCinema, Tollywood, Tollywood News]
.webp)
.webp)





