నటరత్న `బర్త్ డే స్పెషల్`గా రిలీజైన చిత్రాలివే!
on May 28, 2022
మహానటులు నందమూరి తారక రామారావు.. తెలుగునాట ఎన్నో అంశాలకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. పుట్టినరోజు ప్రత్యేకంగా సినిమాలను విడుదల చేయడం కూడా ఇందులో ఒకటి. 1969 మే 28న విడుదలైన `విచిత్ర కుటుంబం`తో బర్త్ డే స్పెషల్ రిలీజ్ ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు ఎన్టీఆర్. ఆపై 1975లో `సంసారం`, 1979లో `శ్రీమద్విరాట్ పర్వము`, 1981లో `సత్యం - శివం`, 1982లో `జస్టిస్ చౌదరి`, 1983లో `చండ శాసనుడు`, 1992లో `సామ్రాట్ అశోక` చిత్రాలతో నటరత్న మరిన్ని `బర్త్ డే స్పెషల్` రిలీజెస్ తో సందడి చేశారు. వీటిలో కొన్ని చిత్రాలు వసూళ్ళ వర్షం కురిపించాయి. ఇక ఎన్టీఆర్ తరహాలోనే ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి అగ్ర కథానాయకులు కూడా `బర్త్ డే స్పెషల్` రిలీజెస్ తో తరువాతి రోజుల్లో ఎంటర్టైన్ చేసినా.. పుట్టినరోజు ప్రత్యేకంగా విడుదలైన సినిమాల సంఖ్య పరంగా ఎన్టీఆర్ దే అగ్ర స్థానం కావడం విశేషం.
అంతేకాదు.. రామారావు బర్త్ డే స్పెషల్ గా రిలీజైన చిత్రాల్లో కొన్ని మల్టిస్టారర్స్ (విచిత్ర కుటుంబం, సత్యం - శివం) ఉండగా.. మరికొన్ని మల్టిరోల్స్ (`శ్రీమద్విరాట్ పర్వము`లో ఎన్టీఆర్ ఐదు వేషాల్లో కనిపించారు. అలాగే `జస్టిస్ చౌదరి`, `చండ శాసనుడు`, `సామ్రాట్ అశోక`లో రెండేసి పాత్రల్లో అలరించారు) కావడం గమనార్హం. అలాగే, ఎన్టీఆర్ స్వయంగా దర్శకత్వం వహించిన చిత్రాలు (శ్రీమద్విరాట్ పర్వము, చండ శాసనుడు, సామ్రాట్ అశోక) కూడా బర్త్ డే స్పెషల్ రిలీజెస్ లో ఉండడం విశేషం.
Also Read