Home

»

Latest News

మైత్రి మూవీస్ లో పవన్ కళ్యాణ్ సినిమా

Oct 30, 2018 4:44PM

 

ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారితో పాటు ప‌లువ‌రితో సినిమాలు  చేయ‌డానికి అడ్వాన్సులు ఇచ్చిన సంగ‌తి నిజమే. కానీ , అడ్వాన్స్ తిరిగి తీసుకుంటున్నామ‌న్న దాంట్లో వాస్త‌వం లేదంటున్నారు వ‌ర‌సు స‌క్సెస్ ల‌తో దూసుకెళ్తోన్న  మైత్రి మూవీ మేక‌ర్స్ ప్రొడ్యూస‌ర్స్ వై. న‌వీన్‌, వై ర‌విశంక‌ర్, మోహ‌న్ చెరుకూరి.  స‌వ్వ‌సాచి చిత్రం విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతోన్న సంద‌ర్బంగా ఈ రోజు మీడియా ముందుకొచ్చారు చిత్ర నిర్మాత‌లు. ఇందులో భాగంగా ప‌వ‌న్ క‌ళ్యాన్ సినిమా గురించి అడ‌గ్గా పై విధంగా స్పందించారు. ఇంకా మాట్లాడుతూ...``ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారితో మాత్రం త‌ప్ప‌కుండా సినిమా చేస్తాం. ఎప్ప‌డ‌నేది చెప్ప‌లేం.  ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇక‌పై సినిమాలు చేయ‌న‌ని చెప్పారు క‌దా అని ఓ జ‌ర్న‌లిస్ట్ అడ‌గ్గా....ఎల‌క్ష‌న్స్  త‌ర్వాతైనా మాతో ప‌వ‌న్ గారు సినిమా చేసే అవ‌కాశాన్ని ఇస్తార‌న్న హోప్స్ అయితే  ఉన్నాయి.  అంతే కానీ అడ్వాన్స్ రిట‌ర్న్ తీసుకుంటున్నాం అన్న వార్త‌ల్లో నిజం లేదు.  అలాగే త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తో కూడా సినిమా ఉంటుంది.  హీరో , క‌థ ఎవ‌ర‌న్న‌ది ఇంకా ఫైనల్ కాలేదు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com