'షకీలా'లో షకీలా
on Oct 30, 2018
షకీలా... బహుశా ఈ పేరు తెలియని దక్షిణాది ప్రేక్షకుడు వుండడేమో! ఉత్తరాది ప్రేక్షకులూ షకీలా చిత్రాలు చూసినవారే. శృంగార చిత్రాలతో ఎంతోమంది కలల రాణిగా నిలిచిన తార షకీలా. ఒకప్పుడు దక్షిణాదిలో ఆమె సినిమాలు విడుదలవుతోంటే... అగ్ర హీరోలు టెన్షన్ పడిన సందర్భాలు వున్నాయి. ఇవన్నీ చూసే ఆమె జీవితంపై సినిమా తీయడానికి ఉత్తరాది దర్శకుడు ముందుకొచ్చారు. హిందీలో ఇప్పుడామె బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. షకీలాగా రిచా చద్దా నటిస్తున్న షకీలా బయోపిక్‌కి ఇంద్రజిత్ లంకేశ్ దర్శకుడు. ఈ సినిమాకి షకీలా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా రిచా చద్దాతో రెండు రోజులు తన పాత్ర గురించి డిస్కషన్ చేశారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... ఈ సినిమాలో షకీలా అతిథి పాత్ర చేస్తున్నారు. షకీలా సినిమాలో షకీలా నటిస్తున్నారన్నమాట! సినిమాలో షకీలాగా రిచా చద్దా చేస్తున్నారు. మరి, షకీలా ఏ పాత్రలో కనిపిస్తారో? ఇటీవల ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు. నటి కావాలని కలలు కనే ప్రతి ఒక్కరూ షకీలా సినిమా చూడాలని దర్శకుడు చెబుతున్నారు. షకీలా ఎన్ని కష్టాలు పడిందో తెలుసుకోవాలని అంటున్నారు.