Home

»

Latest News

ద‌ర్శ‌కులే మా బ‌లమంటున్న మైత్రి నిర్మాత‌లు!!

Oct 30, 2018 5:22PM

 

మ‌హేష్ హీరోగా కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో  శ్రీమంతుడు,  అదే ద‌ర్శ‌కుడితో ఎన్టీఆర్ హీరోగా `జ‌న‌తా గ్యారేజ్, సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ తో `రంగ‌స్థ‌లం` ఇలా వ‌రుస‌గా స్టార్ హీరోల‌తో , స్టార్ ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేసి వ‌రుస స‌క్సెస్ ల‌తో ముందుకు దూసుకెళ్తోంది మైత్రి మూవీ  మేక‌ర్స్ సంస్థ‌. సినిమా రంగంలో అంత‌గా అవ‌గాహ‌న‌లేని వై. న‌వీన్‌, వై ర‌విశంక‌ర్, మోహ‌న్ చెరుకూరి  ఈ ముగ్గురి నిర్మాత‌ల స‌క్సెస్ సూత్రం ఏంట‌ని అడ‌గ్గా  మా ద‌ర్శ‌కులే మా బ‌లం. వారు మంచి క‌థ‌లతో వ‌స్తున్నారు. దానికి ఎంత వ‌ర‌కు స‌పోర్ట్ చేయాలో అంత వ‌ర‌కు స‌పోర్ట్ చేస్తూ సినిమాలు చేస్తున్నాం త‌ప్ప మేం క‌థ‌ల విష‌యంలో అలా ఉండాల‌నీ, ఇలా ఉండాల‌నీ చెప్ప‌డం అంటూ ఏమీ ఉండ‌దు. ఒక్క రవికి త‌ప్ప మాకు అంత‌గా సినిమా ఇండ‌స్ట్రీలో అనుభ‌వం లేదంటున్నారు వై. న‌వీన్‌, మోహ‌న్ చెరుకూరి. 

ఏది ఏమైనా వ‌రుస స‌క్సెస‌ల‌తో ఒక్క‌సారిగా టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా నిలుస్తూ ప్ర‌తి ఒక్క‌రినీ త‌మ వైపు తిప్పుకుంది మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ‌. స‌వ్య‌సా చి న‌వంబ‌ర్ 1న విడుద‌ల చేస్తున్నారు. ఇదే నె ల‌లోశ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ న‌టించిన `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని` సినిమా విడుద‌ల చేస్తున్నారు. ఇలా రెండు భారీ చిత్రాల‌ను ఒకే నెల‌లో రిలీజ్ చేస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారీ నిర్మాత‌లు.  అలాగే సాయి ధ‌ర‌మ్ తేజ్‌,   వైష్ణ‌వ్ తేజ్ , ర‌వితేజలు, మ‌హేష్ బాబు  హీరోలు గా సినిమాలు చేస్తున్నారు.  కోటిన్న‌ర బ‌డ్జెట్ లో కూడా  కొత్త‌వారిని ప‌రిచ‌యం చేస్తూ ఒక సినిమా నిర్మిస్తున్నారు. ఇలా వ‌రుస‌గా  భారీ, మీడియం, లో బ‌డ్జెట్ ల‌తో సినిమాలు నిర్మిస్తూ కొన్ని కోట్ల ట‌ర్నోవ‌ర్ చేస్తోంది మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ‌.   ఈ ముగ్గురు నిర్మాత‌ల మైత్రి    దాదాపు 25 ఏళ్లుగా ఉంద‌ట‌.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com