అయిన వాళ్లే నన్ను మోసం చేశారు!
on Mar 8, 2021
పర్సనల్ విషయాల్ని వెల్లడించడానికి మొహమాటపడే నటకిరీటి రాజేంద్రప్రసాద్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పి షాకిచ్చారు. డబ్బు విషయంలో తనని అయిన వాళ్లే మోసం చేశారని తెలిపారు. మధ్య తరగతి కుటుంబం నుంచి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కథానాయకుడిగా నటించి తనదైన ముద్ర వేశారు.
ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తను మాత్రమే చేయదగ్గ పాత్రల్లో నటిస్తూ నవ్వులు పూయిస్తున్నారు. ప్రస్తుతం 'గాలి సంపత్' చిత్రంలో ఓ విభిన్నమైన పాత్రలో నటిస్తున్నారాయన. ఇటీవలే ఆయన ప్రధాన పాత్రలో నటించిన 'క్లైమాక్స్' చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఓ మీడియాతో ముచ్చటించిన ఆయన పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ఈ సందర్భంగా శివాజీరాజాతో తనకు ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. "ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి ముందే మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకుని గోల్డ్‌మెడల్ సాధించాను" అన్నారు.
"జీవితంలో భాధాకరమైన సంఘటనలు అంటూ ఏమీ లేవు కానీ చాలా మంది దగ్గర నేను మోసపోమయాను.. అదీ ముఖ్యంగా డబ్బు విషయంలో. ఎక్కువగా రక్త సంబంధీకుల వద్దే తాను ఎక్కువగా మోసపోయాను. కొన్ని ఘటనల తరువాత నేను ఇన్నాళ్లూ సంపాదించిన సొమ్ము ఏమైందని చూసుకుంటే అప్పడర్థమైంది.. నేను మోసపోయానని" అన్నారు డా. రాజేంద్రప్రసాద్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
