'బీబీ3'లో హీరోయిన్ ఆమేనా?
on Jul 13, 2020
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తోన్న 'బీబీ3' మూవీలో మెయిన్ హీరోయిన్ ఎవరనేది మొదట్నుంచీ సస్పెన్స్‌గానే ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఓ హీరోయిన్గా అంజలి ఎంపికవగా, మెయిన్ హీరోయిన్ రోల్‌కు ఒకటికి మించిన పేర్లు చక్కర్లు కొడుతూ వస్తున్నాయి. బాలకృష్ణ సినిమా అనగానే ప్రతిసారీ రంగంలోకి వచ్చే పేర్లు నయనతార లేదా శ్రియ. ఈ సారీ వాళ్ల పేర్లు ఆన్లైన్లో బాగా వినిపించాయి. ఆ తర్వాత 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ పాయల్ రాజ్‌పుత్‌ను ఎంపిక చేశారంటూ ప్రచారం జరిగింది. అయితే తననెవరూ ఆ సినిమా కోసం సంప్రదించలేదని ఆమె తేల్చేసింది.
ఆ తర్వాత అమలా పాల్ పేరు చక్కర్లు కొట్టింది. అదీ స్పెక్యులేషనే అని తేలిపోయింది. తాజాగా ముంబైకి చెందిన ఓ మోడల్‌ను బాలయ్య జోడీగా బోయపాటి ఎంపిక చేశాడంటూ ప్రచారంలోకి వచ్చింది. ఆమెది గ్లామరస్ రోల్లో కనిపించనున్నట్లు సమాచారం. 'రూలర్' వంటి డిజాస్టర్ తర్వాత బాలయ్య, 'వినయ విధేయ రామ' లాంటి ఫ్లాప్ తర్వాత బోయపాటి కలిసి చేస్తున్న ఈ సినిమా ఆ ఇద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్‌ను పూర్తి చేస్తుందో, లేదో చూడాలి.