గంగవ్వ అల్లుడికి కడుపు అయితే!
on Aug 14, 2023

ఈ మధ్య మూవీ ప్రమోషన్స్ కోసం ఏకంగా షార్ట్ ఫిల్మ్స్ లోనే నటిస్తున్నారు మన కుర్ర హీరోలు. అందుకు యూట్యూబ్ సెలబ్రిటీలను తీసుకొని మూవీ ప్రమోషన్స్ కానిస్తున్నారు. గంగవ్వ, అనిల్ జీల గురించి ప్రతేకంగా చెప్పనవసరం లేదు. వీళ్ళిద్దరు మై వీలేజ్ షో ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకొని క్రేజ్ లో ఉన్న యూట్యూబర్స్. అప్పట్లో 'పరేషాన్' మూవీ ప్రమోషన్స్ లో హీరో, హీరోయిన్ లతో పాటు రానా వచ్చాడు. రీసెంట్ గా 'హిడింబ' మూవీ టీం గంగవ్వ, అనీల్ జీలతో కలిసి మూవీ ముచ్చట్లు చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి సోహెల్ 'మిస్టర్ ప్రెగ్నెంట్' సినిమా ప్రమోషన్ కోసం గంగవ్వ, అనిల్ జీలాతో కలిసి ఒక వీడియోని చేశాడు.
సయ్యద్ సోహెల్.. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ లో జన్మించాడు. హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత ఇతనికి సినిమాల మీద ఇష్టంతో కొత్త బంగారు లోకంలో నటించాడు. అయితే అందులో అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత కెమెరామెన్ గంగతో రాంబాబు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఢీ ఫర్ దోపిడి, జనతా గ్యారెజ్, గుంటూరు మిర్చి, సినీ మహల్, కోనాపురంలో, యురేకా లాంటి సినిమాల్లో నటించినా పెద్దగా స్క్రీన్ స్పేస్ దక్కలేదు. లక్కీ లక్ష్మణ్ తో పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆర్గానిక్ మామా హైబ్రిడ్ అల్లుడు తో తన యాక్టింగ్ ని మెరుగుపరుచుకున్నాడు. ఇప్పుడు తాజాగా మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాలో హీరోగా నటించాడు సోహెల్.
సోహెల్ అండ్ టీం కలిసి మై విలేజ్ షో యూట్యూబ్ ఛానెల్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. 'గంగవ్వ అల్లుడుకి కడుపు అయితే' అనే టైటిల్ తో వీడియోని షేర్ చేశారు. ఇందులో కూతురు ప్రెగ్నెంట్ అవ్వడం లేదని అత్త గంగవ్వ అల్లుడు సోహెల్ కి తయాత్తు కట్టిస్తుంది. కొన్ని రోజులకి కూతురు నుండి గంగవ్వ కి ఫోన్ వస్తుంది. తను ప్రెగ్నెంట్ అని ఫోన్ రావడంతో తల్లి సంతోషంగా పండ్లు తీసుకొని ఇంటికి వస్తుంది. తీరా ఇంటికి వచ్చిన తర్వాత.. "కడుపు నాకు కాదు, నీ అల్లునికి" అని తల్లి గంగవ్వకి కూతురు చెప్పగానే.. సోహెల్ బామ్మరిది అయిన అనిల్ జీల, గంగవ్వల పరేషాన్ మాములుగా ఉండదు. బిడ్డకి చెప్పే జాగ్రత్తలన్ని అల్లుడికి చెప్పడం నవ్వు తెప్పిస్తాయి. మీరు ఎవరికి చెప్పకండి డెలివరీ మంచిగా అవుద్దని అల్లుడు సోహెల్ తో అత్త, బామ్మరిదిలు ఊరటనిచ్చే మాటలు చెప్తారు. అతని ఫ్రండ్స్ దగ్గర సోహెల్ ప్రెగ్నెంట్ అని చెప్పడంతో అందరూ షాక్ అవ్వడం.. ఇలా ఒక చిన్న సైజు సినిమాని తీశారు సోహెల్, గంగవ్వ అనిల్ జీల. కాగా ఇప్పుడిది యూట్యూబ్ లో ట్రెండింగ్ ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



