Home

»

Latest News

మిస్టర్ పెర్ ఫెక్ట్ సాంగ్స్ లీక్

Mar 12, 2011 11:30AM

prabhas stills, prabhas images, prabhas pics, prabhas photos,  prabhas pictures, prabhas wall papers మిస్టర్ పెర్ ఫెక్ట్ సాంగ్స్ లీకయ్యాయి. "మిస్టర్ పెర్ ఫెక్ట్" మూవీలోని మూడు సాంగ్స్ ఇంటర్నెట్ లో లీకయ్యాయి. మిస్టర్ పెర్ ఫెక్ట్ చిత్రంలోని మూడు సాంగ్స్ యు ట్యూబ్‍ లో లీకయ్యాయి. మిస్టర్ పెర్ ఫెక్ట్ సాంగ్స్ ఎలా లీకయ్యాయో, ఎవరి ద్వారా లీకయ్యాయో తెలియదు. ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం ఈ మిస్టర్ పెర్ ఫెక్ట్ సాంగ్స్ ని పబ్లిసిటీలో భాగంగా ఈ చిత్ర నిర్మాత దిల్ రాజే కావాలని ఇంటర్నెట్ లో లీక్ చేసి ఉంటారని అంటున్నారు. అయినా తెలుగు సినిమాని పైరసీ భూతం అనేక విధాలుగా నాశనం చేస్తోంది. కనుక ఇది దిల్ రాజు పని అనుకోవటం కూడా అనుమానించాలి.

ఎందుకంటే కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీసే ఏ నిర్మాత కోరి కోరి తన సినిమాలోని పాటలను ఇలా లీక్ చేయటానికి ఇష్టపడడు కదా. గతంలో కూడా ఇలా కొన్ని చిత్రాల్లోని సాంగ్స్ ఇలా ఇంటర్నెట్ లో లీకయ్యాయి. దేవీశ్రీ ప్రసాద్ ఈ మిస్టర్ పెర్ ఫెక్ట్ సాంగ్స్ ని చాలా బాగా ట్యూన్ చేశారనీ, అవి ఈ "మిస్టర్ పెర్ ఫెక్ట్" మూవీకి హిట్ కి బాగా ఉపయోగపడతాయనీ సినీ వర్గాలంటున్నాయి. ఈ "మిస్టర్ పెర్ ఫెక్ట్" మూవీలో హీరో ప్రభాస్ ని ఒక కొత్త లుక్ తో కనిపించేలా దర్శకుడు దశరథ్ చూపించారనీ తెలిసింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com