ఇంట్రడక్షన్ సాంగులో ఎయిట్ ప్యాక్ బాడీ
on Jan 23, 2019
వెంకీ అట్లూరి దర్శకుడిగా పరిచయమైన సినిమా ‘తొలిప్రేమ’. ఆ కథ కంటే ముందు రాసిన కథ ‘మిస్టర్ మజ్ను’. అయితే.. అప్పటికి అఖిల్ రెండు సినిమాలు కమిట్ కావడంతో తరవాత చేస్తానని చెప్పాడు. దాంతో మరో కథ రాసుకున్న వెంకీ అట్లూరి ‘తొలిప్రేమ’ తీశాడు. అఖిల్ కోసం ‘మిస్టర్ మజ్ను’ కథతో మూడేళ్లు ఎదురుచూశాడు. ఈ సంగతి స్వయంగా అఖిలే చెప్పాడు. సెట్స్ మీదకు వెళ్లేటప్పుడు కథలో మార్పులేమైనా చేశారా? మూడేళ్ల ముందుది కదా? అని అఖిల్‌ని ప్రశ్నించగా... ‘‘పెద్దగా మార్పులేం చేయలేదు. కానీ, కథలో ఫైట్స్ పెట్టాడు. హీరోకి, హీరో తండ్రికి మధ్య.. హీరోకి, హీరో బాబాయ్‌కి మధ్య ఎమోషనల్ సీన్స్ పెంచాడు. ‘తొలిప్రేమ’ తరవాత వెంకీ నా దగ్గరకు వచ్చి ‘ఈసారి కథను నెక్ట్స్ లెవల్‌కు తీసుకు వెళ్దామనుకుంటున్నా. ఈ మార్పులు చేస్తున్నా’ అన్నాడు. నేను సరేనన్నా’’ అని అఖిల్ తెలిపాడు. సినిమా మొత్తం పూర్తయ్యాక, నాగార్జున సలహా మేరకు ఓ సన్నివేశాన్ని రీషూట్ చేశామన్నాడు. సినిమా ఫసాఫ్‌లో లవ్‌స్టోరీ స్టార్ట్ కావడానికి కొంత టైమ్ పడుతుందని, ఈ లోపు హీరో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సీన్లు వస్తాయని, వాటిని వెంకీ అట్లూరి బాగా తీశాడని అఖిల్ అన్నాడు. హీరో ఇంట్రడక్షన్ సాంగులో ఎయిట్ ప్యాక్ బాడీ చూపించానని, ఆ ఐడియా కొరియోగ్రాఫర్ శేఖర్‌ది అని అన్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
